నాగచైతన్యను వదులుకొని తప్పుచేశా: సమంత

ఏడాదిన్నర సమయం నుంచి ఎటువంటి సినిమా చేయకపోయినప్పటికీ తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. మయోసైటిస్ వ్యాధికి చికిత్స తీసుకునేందుకు సినిమాలకు విరామం ప్రకటించింది. అప్పటివరకు తాను నిర్మాతల దగ్గర నుంచి తీసుకున్న అడ్వాన్స్ ను తిరిగిచ్చేసింది. మయోసైటిస్ కు చికిత్స తీసుకున్న తర్వాత సినిమాల్లో, వెబ్ సిరీస్ ల్లో నటించేందుకు పలు కథలను వింటోంది. సొంత నిర్మాణ సంస్థలో కథానాయిక ప్రాధాన్యమున్న సినిమా చేస్తోంది.

విడాకుల తర్వాతే ఎక్కువ ప్రజాదరణ
అక్కినేని నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత చైతూతో విడాకులు తీసుకున్న తర్వాతే ఎక్కువ పాపులర్ అయింది. వీరిద్దరి విడాకులైన తర్వాత నాగచైతన్య బహిరంగంగా ఎక్కడా సమంత గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. సమంత మాత్రం కొన్ని కొన్ని సందర్భాల్లో పరోక్షంగా చైతూపై వ్యాఖ్యలు చేసింది. దీనిపై అభిమానుల నుంచి వ్యతిరేకతను కూడా ఎదుర్కొంది. కొద్దిరోజుల క్రితం సీనియర్ సినిమా జర్నలిస్టు రామారావు ఓ ఇంటర్వ్యూ ఇస్తూ సమంతకు నాగచైతన్యపై ఉన్న ప్రేమాభిమానాల గురించి చెప్పారు. వారిద్దరికీ ఒకరిపై ఒకరికి తరగని ప్రేమ ఉందని, వారిద్దరూ ఎప్పటికైనా కలుస్తారని, ఇది నిస్సందేహంగా నిజమన్నారు.

heroine samantha relalistic comments on her ex husband akkineni nagachaitanya

క్షోభను అనుభవిస్తోంది
బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ సమంత మాత్రం నాగచైతన్యను వదులుకొని తప్పుచేశానంటూ క్షోభను అనుభవిస్తోందని ఆమె సన్నిహితులు చెబుతుంటారు. ఆ విషయం తమకు తెలుసని ఎందుకు చైతూను వదులుకున్నానా అంటూ ఇప్పటికీ బాధపడుతుంటుందని, తన జీవితంలో చేసిన అతిపెద్ద పొరపాటు అదేనని అన్నట్లు వార్తలు వచ్చాయి. జీవితంలో ఎదురైన చేదు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఎవరైనా సరే తమ సన్నిహితులు ఎవరు? తమ శ్రేయోభిలాషులు ఎవరు? అనే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎవరినీ దగ్గరకు రానివ్వకూడదని, తన ఆప్తులతోనే చివరి వరకు ఉండాలని ఒక కార్యక్రమంలో సమంత చెప్పిన మాటలు ఆమెకే వర్తిస్తాయంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+