నాగచైతన్యకు సారీ చెప్పిన సమంత?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ గా, అందాల ముద్దుగుమ్మగా కొనసాగుతోన్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. చిన్న చిన్న మనస్పర్థల వల్ల ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. కొంతకాలం నుంచి మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత చికిత్స కోసం కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించింది. చికిత్స అనంతరం కథలను వింటూ సినిమాల్లో బిజీ అవ్వాలని ప్రయత్నిస్తోంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాతే సమంతపై నెగెటివ్ ట్రోలింగ్ ఎక్కువగా జరిగింది.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఫ్యామిలీమెన్ వెబ్ సిరీస్ వల్ల ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నట్లు తెలిపింది. తన హోమ్ ను రాజీ పాత్ర పాడు చేసిందని, ఆ వెబ్ సిరీస్ లో తన పాత్రవల్ల ఎవరైనా బాధపడితే క్షమించాలని కోరింది. ప్రస్తుతం సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కామెంట్స్ చేసిన ఇన్నిరోజుల తర్వాత క్షమించండంటూ అడగటమేంటని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సమంత ఇంత అకస్మాత్తుగా సారీ చెప్పడానికి కారణమేంటని వీరంతా విశ్లేషిస్తున్నారు.

heroine samantha says sorry to naga chaitanya

అయితే కొందరు నెటిజన్లు మాత్రం సమంత నాగచైతన్యకే సారీ చెప్పిందని, ఈ సిరీస్ లో సామ్ తన పాత్రకు వందశాతం న్యాయం చేసినప్పటికీ ఈ క్యారెక్టర్ వల్ల తన ఇమేజ్ మొత్తం డామేజ్ అయింది. దీనివల్లే ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకున్నారంటూ అప్పట్లోనే వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వెబ్ సిరీస్ లో తాను పోషించిన పాత్రవల్ల క్షమాపణలు అడగటమంటే చైతన్యతో కలిసిపోవాలనే నిర్ణయానికి వచ్చిందని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడంవల్లే సారీ అంటోందని చర్చ నడుస్తోంది. నాగచైతన్య-సమంత కలిసిపోవాలని అభిమానులంతా బలంగా కోరుకుంటున్నారు. వీరిద్దరూ కేవలం చిన్న చిన్న మనస్పర్థలవల్లే విడిపోయారని, మళ్లీ కలిసిపోతే ఇంత మంచి జంట ఉండదంటూ వ్యాఖ్యానించుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+