ముచ్చటగా మూడో బిడ్డకు తల్లైన శ్రీలీల
టాలీవుడ్ మోస్ట్ వాటెండ్ హీరోయిన్ అంటే అందరు ఠక్కన చెప్పే పేరు శ్రీలీల. ప్రస్తుతం అరడజనుకు పైగా ఆమె చేతితో సినిమాలు ఉన్నాయి. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు చాలా సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. శ్రీలీల నటించిన సినిమాలు నెలకు ఒకటి విడుదల అవుతుందంటే ఆమె ఎన్ని సినిమాలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా శ్రీలీల అనే చెప్పాలి.
మరే హీరోయిన్‌కు సాధ్యం కానీ విధంగా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు మొన్నటి వరకు మార్మోగిపోయింది. అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి. అయితే తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ, తమిళ, హిందీ భాషల్లో అమ్మడుకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉండగానే ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా శ్రీలీల రెడీ అయిపోయింది.

స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహిం ఖాన్ ప్రస్తుతం 'దిలర్' మూవీ చేస్తున్నాడు. ఇందులో శ్రీలీలని హీరోయిన్‌గా తీసుకున్నారు.నాగ చైతన్య కొత్త సినిమాలో కూడా శ్రీలీలనే హీరోయిన్‌గా తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ఓ సినిమా చేస్తోంది.ఈ సినిమాలు హిట్ అయితే శ్రీలీల పంట పండినట్లే.
ఇదిలా ఉంటే శ్రీలీల ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని వారి సంరక్షణ తానే దగ్గరుండి చూసుకుంటున్నారు. శ్రీలీల ఇదివరకే ఇద్దరు దివ్యాంగ పిల్లలను (గురు మరియు శోభిత) 2022లో దత్తత తీసుకున్నారు. తాజాగా, ఆమె తన సోషల్ మీడియాలో ఒక చిన్న పాపతో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో, నెటిజన్లు ఆమె మూడో బిడ్డను కూడా దత్తత తీసుకున్నారేమోనని చర్చించుకుంటున్నారు.
ఆమె షేర్ చేసిన ఫోటోలో ఒక చిన్నారి పాపను ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. అయితే, శ్రీలీల ఈ పాప ఎవరు అనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొందరు నెటిజన్లు ఆ పాప ఆమె బంధువుల అమ్మాయి అయి ఉండొచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు.
శ్రీలీల చిన్న వయసులోనే ఇద్దరు దివ్యాంగ పిల్లలను దత్తత తీసుకోవడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె మంచి మనసుకు ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు మరో పాపతో కనిపించడంతో, ఆమె దాతృత్వం మరోసారి వార్తల్లో నిలుస్తోంది.శ్రీలీల ఈ విషయంపై అధికారికంగా స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు.












Click it and Unblock the Notifications