బోల్డ్ సీన్లతో మత్తెక్కిస్తున్న హీరోయిన్లు
ప్రతి హీరోయిన్‌కు స్టార్ హీరోయిన్ అవ్వాలి.. మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే కోరిక ఉంటుంది. అగ్రహీరోలకు హీరోయిన్లుగా నటించిన కొందరు ఇటీవలి కాలంలో హిట్టు లేక ఇబ్బంది పడుతున్నారు. దీంతో తమకున్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను వీరే బ్రేక్ చేస్తున్నారు. బోల్డ్ సీన్లలో నటించడానికి ఏమాత్రం వెనుకంజ వేయడంలేదు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత టాలీవుడ్‌లో లిప్ లాక్ సీన్లు, బోల్డ్ కంటెంట్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ బాలీవుడ్‌లో వచ్చిన 'ది ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ తో బోల్డ్ సీన్‌కు ఓకే చెప్పింది. ఈ సిరీస్ తర్వాత అల్లు అర్జున్ హీరోగా నటించి 'పుష్ప' చిత్రంలో 'ఊ.. అంటావా మావ' పాటతో పెద్ద సంచలనాన్ని క్రియేట్ చేసింది. మరో స్టార్ హీరోయిన్ తమన్నా కూడా పెద్దగా హిట్లు రాకపోవడంతో 'లస్ట్ స్టోరీస్' 'జీ కర్దా' లో బోల్డ్ పెర్ఫామెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించింది. నేను శైలజ, నేను లోకల్ వంటి సినిమాలతో ఆడియన్స్‌కు దగ్గరైన తమిళ బ్యూటీ కీర్తి సురేష్ కూడా 'సర్కారు వారి పాట' సినిమాలో టూ మచ్ గ్లామర్ షో చేసింది. అంతేకాదు.. సాంగ్స్ లో రెచ్చిపోయి స్టెప్పులేసింది. ఆ తర్వాత ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని క్రియేట్ చేసింది.

నేషనల్ క్రష్ రష్మిక.. రౌడీ హీరో విజయ్ దేవరకొండతో లిప్ లాక్ సీన్లలో నటించిన సంగతి తెలిసిందే. ఆమె తాజా చిత్రం 'యానిమల్'లో రణ్‌బీర్‌తో బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. ఒకరకంగా ఫ్యాన్స్‌కు షాకిచ్చిందని చెప్పవచ్చు. పంజాబీ ముద్దుగుమ్మ మోహ్రీన్ పిర్జాదా 'ఢిల్లీ సుల్తాన్' అనే వెబ్ సిరీస్‌లో హాట్ సీన్స్ చేసింది. సాంప్రదాయ నటనకు గుడ్‌బై చెప్పి రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ సీన్లలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన అనుపమ పరమేశ్వరన్ కూడా 'ఫ్రీడమ్@మిడ్ నైట్' లో హాట్‌గా కనిపించింది.












Click it and Unblock the Notifications