హనీరోజ్ సంపాదన ఎలా ఉందో తెలుసా?

నందమూరి నటసింహం బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి చిత్రంలో నటించిన హనీరోజ్ రాత్రికి రాత్రే పెద్ద క్రేజ్ ను సొంతం చేసుకుంది. స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. సినిమాల్లో అవకాశాలు తక్కువగానే వస్తున్నప్పటికీ తన ఆదాయం మాత్రం వివిధ మార్గాలద్వారా సంపాదించుకుంటోంది. పెద్ద పెద్ద షోరూం లు, మాల్స్ ఓపెనింగ్స్ అన్నీ హనీరోజ్ చేతులమీదగానే జరిగిపోతున్నాయి. అందుకు కారణం.. తనది లక్కీహ్యాండ్ అనే ముద్ర పడటమే. ఇలా ఓపెనింగ్స్ కు హాజరవుతూ లక్షల రూపాయలను సంపాదిస్తోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ జువెలరీ షోరూమ్ ను ప్రారంభించింది. అక్కడికి అభిమానులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. వేసుకున్న డ్రస్ చూస్తే కుర్రకారుకు మతిపోయినంత పనైంది. స్లీవ్ లెస్ తోపాటు ఫ్లోర్ లెంగ్త్ గౌన్ వేసుకొని మెరుపుతీగలకన్నా మిన్నగా తళుకు తళుకుమంటూ మెరిసిపోయింది. అభిమానులేకాదు.. అక్కడికి వచ్చిన అతిథులు, ప్రజలు కూడా అలాగే చూస్తుండిపోయారు. మెడలో వజ్రాలు పొదిగిన హారం వేసుకొని స్టేజ్ పై నుంచి ఫ్లైయింగ్ కిస్సుల వర్షాన్ని కురిపించింది.

honey rose earning money doing shopping malls opening

2005లో మలయాళంలో విడుదలైన 'బాయ్ ఫ్రెండ్' సినిమా ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మళయాళంతో పాటు క‌న్నడ‌, త‌మిళ‌, తెలుగు సినిమాల్లో నటించింది. హనీ రోజ్ తెలుగులో తొలిసారి ఆల‌యం, ఈ వ‌ర్షం సాక్షిగా సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు చేరువైంది. నందమూరి బాలకృష్ణ హీరోగా వీర సింహా రెడ్డి 107వ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించి అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోన్న హనీరోజ్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న విశ్వంభర చిత్రంలో ఒక హీరోయిన్ గా నటిస్తోందంటూ వార్తలు వస్తున్నాయికానీ వాటిపై అధికారికంగా ధ్రువీకరణ రాలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+