పవన్ కుమారుడు మార్క్ శంకర్ వైద్యానికి ఎంత ఖర్చు అయ్యిందంటే..?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవలే గాయపడిన విషయం తెలిసిందే. సింగపూర్ లోని సమ్మర్ క్యాంప్ స్కూల్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్ గాయపడ్డాడు. కుమారుడికి ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. తన పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాతే సింగపూర్ వెళ్లారు. పవన్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కూడా వెళ్లారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి వైద్యులతో కూడా మాట్లాడారు.
త్వరగానే కోలుకున్న మార్క్ శంకర్ ఆసుపత్రి నుండి కూడా డిశ్చార్జ్ అయ్యాడు. అయితే మార్క్ చేతులకు, కాళ్లకు చిన్నపాటి గాయాలు కావడంతో పాటు నల్ల పొగ పీల్చడం వలన వైద్యులు తగు ట్రీట్‌మెంట్ అందించారు. మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు కాలిన గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో ముందు అత్యవసర చికిత్స అందించారు. బుధవారం ఉదయం అత్యవసర వార్డు నుంచి గదికి తీసుకువచ్చారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. అయితే బ్రోన్కో స్కోపీ అనే ట్రీట్‌మెంట్‌ని మార్క్ శంకర్‌కి అందించినట్టు తెలుస్తుంది.

ఈ ట్రీట్ మెంట్ కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని చాలా మంది భావిస్తున్నారు. లంగ్స్ లో చేరిన విషవాయువుని తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్ ని వదలడం కోసం దీన్ని చేస్తారు. అయితే పరిస్థితి తీవ్రత ని బట్టి ఏ తరహా బ్రోన్కోస్కోపీ ట్రీట్మెంట్ ఇవ్వాలనేది డాక్టర్స్ నిర్ణయిస్తారని అంటున్నారు. దీనిని ప్రమాదం జరిగిన 30 నిమిషాల లోపే చేయాలని.. లేదంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు. అయితే మార్క్ శంకర్ ఆసుపత్రి బిల్లు లక్షలలో అయి ఉంటుందని నెట్టింట చర్చ నడుస్తుండగా.. తక్కువలోనే ట్రీట్‌మెంట్ పూర్తైందని మెగా ఫ్యామిలీ సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.
ప్రస్తుతం మార్క్ శంకర్ లేచి నడుస్తూ మాట్లాడుతున్నాడని సమాచారం. అయితే ఊపిరితిత్తుల్లోకి పొగ బాగా వెళ్లడంతో కొంచెం అసౌకర్యంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల పాటు ఆక్సిజన్ మాస్క్‌తోనే మార్క్ శంకర్ ఉండనున్నట్టు చెబుతున్నారు. మరో మూడు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆసుపత్రి వైద్యులు తెలియచేశారు.
ఇక ప్రస్తుతం చిరంజీవి, పవన్ కళ్యాణ్ సింగపూర్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మార్క్ శంకర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని.. ఆ తర్వాత అతన్ని హైదరాబాద్ కి తీసుకురావడానికి మరో రెండు మూడు రోజుల సమయం పట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. చిరంజీవి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఇండియా కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ మాత్రం సోమవారం వరకు వచ్చే అవకాశాలు లేవంటున్నారు.












Click it and Unblock the Notifications