నా ఫస్ట్ లవ్ .. అందుకే మరవలేకపోతున్నా - సమంత

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. సమంత ఇటీవల సినిమాల్లో కన్నా వార్తల్లోనే ఎక్కువగా నిలుస్తున్నారు. నాగ చైతన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారామె. ఆర్యోగం సహకరించక పోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు. మయసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత, ఇప్పుడిప్పుడే కోలుకుంది.దీంతో వరుస సినిమాలను లైన్లో పెడుతోంది.

విజయ్ దేవరకొండతో కలిసి నటించిన 'ఖుషి' సినిమా తరువాత సమంత మరో తెలుగు సినిమాలో నటించలేదు. 'సిటాడెల్' అనే బాలీవుడ్ వెబ్ సిరీస్‌‌లో మాత్రం సమంత నటించారు.అయితే భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ వెబ్ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'మా ఇంటి బంగారం' సినిమాతో సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతుంది.

I can t stay away from acting anymore -Samantha

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఆమె అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ..సినిమాలు నా మొదటి ప్రేమ. నేను ఇకపై నటనకు దూరంగా ఉండలేను" అంటూ భావోద్వేగంగా తెలిపింది.ఇకపై నా జీవితం గురించి ఎవరికీ చెప్పాలనే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చింది.సినిమాలు తప్పు నాకు మరో లోకం తెలియదని సమంత తెలిపింది.

ఏ మాయ చేశావే సినిమాతోనే సమంత తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ సినిమాలో సమంత మాజీ భర్త నాగ చైతన్య హీరోగా నటించారు.

షూటింగ్‌ సమయంలో వీరి మధ్య ప్రేమ చిగురించడంతో, ఈ జంట పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.. నాగ చైతన్య, సమంత 2017లో వివాహ బంధంతో ఒకటయ్యారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో బెస్ట్ జోడిగా ఉంటారనుకునేలోపే వీరు విడిపోయారు. మరోవైపు సమంత తెలుగులో రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

'మా ఇంటి బంగారం' సినిమాకు ఆమె నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా సమంత విడుదల చేశారు. ఇది అభిమానులను ఆకట్టుకుంది.ఈ సినిమానే కాకుండా ప్రముఖ దర్శకులు రాజ్-డీకే తెరకెక్కిస్తున్న 'రక్త బ్రహ్మాండం' వెబ్ సిరీస్‌లో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తోంది. ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.ఈ చిత్ర దర్శకుల్లో ఒకరైన రాజు నిడుమోరుతో సమంత రిలేషన్‌లో ఉందంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరు చెట్టా పట్టాల్ వేసుకుని తిరుగుతున్నారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈ ప్రచారంపై సమంత మాత్రం నోరు మెదపడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+