మా రిలేషన్‌లో ఎటువంటి తప్పు చేయలేదు: సమంత
అక్కినేని నాగచైతన్య ఎట్టకేలకు కొద్దికాలంగా తాను ప్రేమిస్తున్న అమ్మాయి శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. త్వరలోనే వివాహం జరిగే తేదీని ప్రకటిస్తారు. నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా ఈ వేడుక జరిపారు. దీంతో ఒక్కసారిగా అభిమానులంతా షాక్ అయ్యారు. ఎప్పటికైనా నాగచైతన్య-సమంత కలిసిపోతారనే ఆశతో అక్కినేని అభిమానులు ఉన్నారు. అయితే శోభితతో నిశ్చితార్థం జరగడంపై వారంతా సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. దీనిపై గతంలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి.
ఒక్క మాటతో తేల్చేసిన సమంత
సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభిత ధూళిపాళ్లతో ప్రేమలో ఉన్నారంటూ కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. గురువారంతో ఆ వార్తలు నిజమయ్యాయి. గతంలో వీరిద్దరూ వేసవి సెలవులను గడిపేందుకు యూరప్ దేశాల్లో పర్యటించారు. ఓ వైన్ పార్టీ జరిగే సమయంలో అనుకోకుండా చైతూ, శోభిత ప్రత్యక్షం కావడంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. అదే సమయంలో సమంత కొన్ని వ్యాఖ్యలు చేశారు. తమ రిలేషన్ లో ఎటువంటి తప్పు చేయలేదని ఒక్క మాటతో ఆమె తేల్చేశారు.

ముగిసిన సమంత, చైతూ అధ్యాయం
పరోక్షంగా విడాకులు తీసుకోవడానికి నాగచైతన్య కారణమన్నట్లైంది. శోభితతో నిశ్చితార్థం చేసుకోవడంతో ఈ మాట నిజమైందని సమంత అభిమానులు అంటున్నారు. సమంత చేసిన వ్యాఖ్యలు సరైనవే అంటు నెటిజన్లు ఇప్పుడు నాగచైతన్యపై విరుచుకుపడుతున్నారు. వాస్తవానికి చైతూకు, సమంతకు విడాకులైన తర్వాత నాగచైతన్య ఇప్పటివరకు ఆమెపై ఎక్కడా ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కొన్ని సందర్భాల్లో సమంత మాత్రం పరోక్షంగా నాగచైతన్యను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది. ఆమె నాగచైతన్య ను ఉద్దేశించే చేసిందని అందరికీ అర్థమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నాగచైతన్య-సమంత అధ్యాయం ముగిసింది.












Click it and Unblock the Notifications