100 కోట్లు ఇచ్చిన ఆ స్టార్ హీరోతో నటించను - నయనతార
సౌత్‌లో స్టార్ హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తుకు వచ్చేది నయనతారనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తూ నయనతార స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ముఖ్యంగా తమిళనాట నయనతార క్రేజ్ వేరు. అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని సంపాదించుకుంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. అయితే పెళ్లి తరువాత నయనతార హవా కాస్తా తగ్గిందనే చెప్పాలి. నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
విఘ్నేష్ శివన్ కన్నా ముందు శింబు, ప్రభుదేవాలతో ప్రేమాయణం సాగించింది ఈ హ్యాట్ బ్యూటీ. వివాహం తరువాత నయనతార జీవితం అంత సాఫీగా సాగలేదనే చెప్పాలి. పెళ్లి తరువాత నయనతార పలు వివాదాల్లో నిలిచింది. సరోగసి ద్వారా పిల్లలను కనడం పెద్ద దుమారమే సృష్టించింది. ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ నుంచి కూడా నయనతారకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో నయనతార సోషల్ మీడియాలో ఉండేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోంది.

బాలీవుడ్ ఆడియన్స్ దృష్టిలో పడేందుకు వరుస బాలీవుడ్ ఈవెంట్స్‌లో హాజరు అవుతున్నారు. ఇదిలా ఉంటే నయనతారకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.రూ.100 కోట్లు ఇచ్చిన ఓ హీరో పక్కన నయనతార అన్నట్టుగా ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ హీరో మరెవరో కాదు.. శరవణన్.తెలుగు, తమిళ, కన్నడ సినీ ప్రేక్షకులకు శరవణన్ సుపరిచితమే.
శరవణన్ హీరోగా 2022లో ది లెజెండ్ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాలో మొదటగా నయనతారను హీరోయిన్‌గా తీసుకుందామని భావించారట. అయితే శరవణన్ పక్కన హీరోయిన్‌గా చేయడానికి నయనతార అంగీకరించలేదట. దీంతో ఆ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలా నటించింది.అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఎందుకంటే నయనతారతో పాటు, శరవణన్ దీనిపై ఎప్పుడు స్పందించలేదు.బాక్సాఫీస్ వద్ద ది లెజెండ్ సినిమా ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. ఇలాంటి సినిమాలో నయనతార నటించకపోవడమే మేలని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications