ఆరుగురు హీరోలు వద్దంటే ధైర్యంగా బాలయ్య చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు

ఒక కథను తయారుచేసుకునేటప్పుడు రచయితకానీ, దర్శకుడుకానీ ఒక హీరోను దృష్టిలో పెట్టుకొని అతని బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా కథను తయారు చేసుకుంటారు. తీరా ఆ హీరో దగ్గరకు వెళ్లే సమయానికి కాల్షీట్లు ఖాళీ లేకపోవడం, కథ నచ్చకపోవడంతోపాటు ఇతరత్రా కారణాలన్నీ కలిపి దాన్ని తిరస్కరిస్తారు. దీంతో దర్శకుడు మళ్లీ హీరోల చుట్టూ తిరుగుతుంటాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఇది సహజంగా జరుగుతుండే సంఘటనే. అయితే ఆరుగురు హీరోలు మేం చేయమని తిరస్కరిస్తే ఆ కథను ధైర్యంగా బాలకృష్ణ చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఆ ఘనత మాత్రం బాలయ్యకే దక్కుతుంది.

ఆరుగురు హీరోలు చేయమన్నారు
దర్శకుడు కె.మురళీమోహన్ రావు చిరంజీవి-విజయశాంతి కాంబినేషన్ లో సంఘర్షణ అనే సూపర్ హిట్ సినిమా తీశారు. మళ్లీ చిరంజీవితో సినిమా చేసేందుకు కథానాయకుడు పేరుతో కథను సిద్ధం చేసుకున్నారు. పరుచూరి బ్రదర్స్ ఈ కథను సిద్ధం చేశారు. కథలో హీరో పాత్రకంటే శారద పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో చిరంజీవి తిరస్కరించారు. తర్వాత ఇదే సినిమాను కృష్ణతో చేయాలని దర్శకుడు భావించాడు. సినిమాలో హీరో వేసే ప్లాన్స్ అన్నీ ఫెయిలవుతుంటాయి.. అలాంటి సినిమాకు కథానాయకుడు అని పేరు పెట్టి సినిమా తీస్తే నిన్ను, నన్ను అందరినీ ప్రేక్షకులు బండబూతులు తిడతారంటూ కృష్ణ వద్దన్నారు. తర్వాత సుమన్ దగ్గరకు, అక్కడి నుంచి కృష్ణం రాజు దగ్గరకు, ఆయన దగ్గర నుంచి రమేష్ బాబు దగ్గరకు వెళ్లింది.

If the six heroes didn t do it finally Balayya did it kathanayakudu movie

హిందీలో యావరేజ్ గా నిలిచింది
వీరంతా కథానాయకుడు సినిమాను తిరస్కరించారు. చివరిగా బాలయ్యను కలుద్దాం.. ఆయన కూడా చేయనంటే ఈ కథను పక్కన పడేద్దామని మురళీమోహన్ రావు నిశ్చయించుకున్నారు. బాలయ్యను కలిసి కథ చెప్పగా ఆయనకు బాగా నచ్చింది. విజయశాంతిని హీరోయిన్ గా పెట్టి సినిమాను పట్టాలెక్కించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డాక్టర్ డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకుంది. ఇదే సినిమాను హిందీలో మిథున్ చక్రవర్తి, మీనాక్షి శేషాద్రితో దిల్ వాలా పేరు తీయగా అక్కడ యావరేజ్ గా నిలిచింది. హిందీ సినిమాకు కూడా మురళీమోహన్ రావే దర్శకత్వం వహించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+