ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !!
గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఒక మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. అలానే ఈ సినిమాలో మలయాళ సీనియర్ నటులు బిజూ మీనన్.. యంగ్ హీరో టోవినో థామస్ కూడా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీస్థాయిలో నిర్మిస్తున్నారు. జూన్ 25, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓ వైపు ఆర్ఆర్ఆర్, దేవర చిత్రాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు తారక్. మరోవైపు కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్ చిత్రాల్లో హ్యాట్రిక్ హిట్లు కొట్టిన ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకున్నాయి. కాగా ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ బక్కచిక్కారు. సుమారుగా 18 కేజీల బరువు తగ్గి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ మూవీ టైటిల్ ఇంకా రివీల్ చేయకపోయినా.. "డ్రాగన్" అనే టైటిల్ ఫిక్స్ అయ్యిందంటూ జోరుగా ప్రచారం నడుస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్, అలియా భట్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ మూవీలో చరణ్ కి జోడీగా ఈ బాలీవుడ్ బ్యూటీ మెప్పిస్తే.. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం చిత్రబృందం ఆమెతో సంప్రదింపులు జరిపిందని టాక్ వినిపిస్తుంది. కాగా అందుకు అలియా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ పేరు వినిపిస్తోంది. మొదట ఈ పాత్ర కోసం మలయాళ నటుడు టొవినో థామస్‌ను అనుకున్నప్పటికీ.. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆయన తప్పుకున్నారు. దాంతో షాహిద్ కపూర్‌ను విలన్‌గా చూపించి పాన్-ఇండియా స్థాయిలో సినిమాపై అంచనాలు పెంచాలని నీల్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ముద్ర పడే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్దకలెక్షన్స్ సునామీ సృష్టించడం ఖాయమని అంటున్నారు.
-
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications