22 ఏళ్లకే మాజీ సీఎం మేనల్లుడితో పెళ్లి.. ఎవరా స్టార్ హీరోయిన్ !

తెలుగు చిత్రసీమలో చిన్న వయసులోనే స్టార్ డమ్‌ను అందుకున్న చాలా మంది నటీమణులు ఉన్నారు. అలాంటి వారిలో ఫటాఫట్ జయలక్ష్మి ఒకరు. తన తొలి చిత్రంతోనే ప్రేక్షకులను మెప్పించి, తక్కువ సమయంలోనే వెండితెరపై తనదైన ముద్ర వేసుకుంది. నటన, అందం, తనదైన శైలితో దక్షిణ భారత సినీరంగాన్ని ఏలిన ఈ అచ్చ తెలుగు నటి జీవితం మాత్రం విషాదంగా ముగిసింది.

16 ఏళ్లకే స్టార్ హీరోయిన్..

1958లో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన జయలక్ష్మి రెడ్డి, 1972లో 14 ఏళ్ల వయసులో 'ఇద్దరు అమ్మాయిలు' సినిమాతో సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించి తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు పొందింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ వరుస అవకాశాలు దక్కించుకుని, 16 ఏళ్లకే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. మెగాస్టార్ చిరంజీవితో పాటు ఎన్టీఆర్, కృష్ణ, రజినీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్రహీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె, అప్పట్లో ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతో సంపాదించింది. ప్రేక్షకులు ఆమె సినిమాల కోసం ఎదురుచూసేవారు.

interesting-details-of-old-actress-jayalakshmi-reddy

ఎంజీఆర్ మేనల్లుడితో పెళ్లి..

అంతే కాకుండా 2018లో రజినీకాంత్ ఒక ఇంటర్వ్యూలో "ఫటాఫట్ జయలక్ష్మి నాకు చాలా ఇష్టమైన నటి" అని పేర్కొన్నారు. ఆమెతో పని చేసిన తారల్లో చాలామందికి ఆమె ఫేవరెట్ హీరోయిన్. అయితే మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఆమె జీవితం మలుపు తిరిగింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ మేనల్లుడు సుకుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ తక్కువ కాలంలోనే వారి మధ్య విభేదాలు తలెత్తాయి. విడాకుల తర్వాత జయలక్ష్మి తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై, 22 ఏళ్ల వయసులో అధిక మోతాదులో నిద్రమాత్రలు తీసుకుని తనువు చాలించింది. ఈ సంఘటన సినీ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది.

తక్కువ సమయంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన జయలక్ష్మి జీవితం ప్రేమ, పెళ్లి కారణంగా విషాదాంతంగా ముగిసింది. ఆమె మరణం ఇప్పటికీ సినీ ప్రేమికుల గుండెల్లో బాధగా నిలిచిన ఘటనగా మిగిలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+