విడాకుల తర్వాత సమంతను బ్లాక్‌లిస్ట్ చేశారా? లక్ష్మీ మంచు సంచలనం!

Manchu Lakshmi: ప్రముఖ నటి లక్ష్మీ మంచు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ స్టార్ నటుడి మాజీ భార్యకు విడాకుల తర్వాత సినీ అవకాశాలు రావడం లేదన ఇచ్చిన సినిమాలను కూడా వెనక్కి తీసుకున్నారని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతు రుతు ప్రభు గురించేనని అంతా భావిస్తున్నారు.

హింట్ ఇచ్చిన లక్ష్మీ మంచు
ఓ ఇంటర్వ్యూలో లక్ష్మీ మంచు మాట్లాడుతూ.. సమాజంలో పురుషుల కంటే మహిళలు చాలా ఎక్కువ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఓ సూపర్ స్టార్ మాజీ భార్యకు విడాకుల అనంతరం అవకాశాలు తగ్గిపోయాయని ఆమె పేర్కొన్నారు. ఆమెకు సినిమా ఆఫర్లు ఇచ్చినా కూడా.. అవి వెనక్కి తీసేసుకున్నారని లక్ష్మీ మంచు చెప్పుకొచ్చారు. "ఆమెను తీసుకుంటే వారికి(నాగచైతన్య) నచ్చకపోవచ్చు, ఆ తర్వాత వారు ఆగ్రహం వ్యక్తం చేయొచ్చు" అని ఆమెతో చెప్పారట అంటూ లక్ష్మీ మంచు చెప్పుకొచ్చారు. "ఇప్పుడు ఆమె మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఆమె పేరు చెప్పాల్సిన అవసరం లేదని లక్ష్మీ చెప్పారు.

Is Samantha Being Blacklisted After Divorce Lakshmi Manchu s Shocking Hints

అయితే రిపోర్టర్ లక్ష్మీ మంచును సమంత గురించి అంటున్నారా అని ప్రశ్నించగా.. లక్ష్మీ మంచు స్పందిస్తూ.. "మీరు సమంత గురించి అనుకుంటున్నారు. కానీ కేవలం ఒక సూపర్ స్టార్ కాదు, ఐదారుగురు సూపర్ స్టార్లకు విడాకులయ్యాయి. నేను వారందరికీ దగ్గరగా ఉంటాను. కానీ నా పాయింట్ ఏమిటంటే, ఓ పురుషుడికి ఇలా జరిగితే అతని జీవితం ఎప్పుడూ మారదు. కానీ ఒక మహిళకు పెళ్లి, పిల్లలు, అత్తమామలు అని బాధ్యతలు పెరుగుతాయి. సమాజం మహిళలకు స్వేచ్ఛ ఇవ్వదు. మనమే అన్నింటినీ భరించాలి." అని లక్ష్మీ మంచు అన్నారు.

సమంత నాగచైతన్యల బ్రేకప్
సమంత రుతు ప్రభు నాగచైతన్యను 2017లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. విడాకుల అనంతరం సమంత కెరీర్ పడిపోతోందని.. రిలీజ్ అయిన సినిమాలు కూడా ఆశించిన విజయం సాధించలేదని సినీ వర్గాల సమాచారం. విడాకుల తర్వాత సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నారని పుకార్లు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఉన్న కొన్ని రొమాంటిక్ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. మరోవైపు నాగచైతన్య నటి శోభితతో డేటింగ్ చేసి 2024లో ఆమెను పెళ్లి చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+