టాప్ హీరో, ఫేమస్ నిర్మాత లొల్లి, డీకే ఎంట్రీతో శ్యాండిల్ వుడ్ షాక్, ఏం జరుగుతుందో, ఏమైపోతుందో !
కన్నడ చిత్ర పరిశ్రమలో సినిమాల కంటే ఎక్కువ హాట్ టాపిక్ లో ఉన్న మ్యాటర్ ఏమిటంటే హీరో దర్శన్, ప్రముఖ నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ మధ్య గొడవ. ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ కేసులో నటుడు దర్శన్‌పై వరుస ఫిర్యాదులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. ఈ సమయంలో వీరిద్దరి పోరుకు కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ అడ్డుకట్ట వేస్తారా? అన్న ఉత్సుకత నెలకొంది.
కాటేరా 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ సినిమా హీరో దర్శన్ శ్యాండిల్ వుడ్ ప్రముఖ నిర్మాత ఉమాపతిపై విరుచుకుపడ్డారు. నిర్మాత ఉమాపతిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హీరో దర్శన్ ఆయన మీద విరుచుకుపడ్డారు. కాటేరా 50 రోజుల వేడుక సందర్బంగా ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకలకు హాజరు అయిన చాలా మంది ప్రముఖులు హీరో దర్శన్ వ్యాఖ్యలతో షాక్ అయ్యారు.

హీరో దర్శన్ చేసిన ఈ ప్రకటన దుమారం రేపగా, నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ గౌడ్ వరుస ప్రకటనలు ఇస్తున్నారు. అదే సమయంలో సినీ నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ డీసీఎం డీకే శివకుమార్‌ను కలిశారు. ఇదే సమయంలో హీరో దర్శన్, నిర్మాత ఉమాపతి విషయంలో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఎంట్రీ గ్యారెంటీ శ్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు అంటున్నారు.
బెంగళూరులో డీసీఎం డీకే శివకుమార్ పాల్గొన్న కార్యక్రమంలో నిర్మాత ఉమాపతి శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు. ఈ సమయంలో నిర్మాత ఉమాపతి డీకే శివకుమార్ దగ్గరకు వెళ్లి ఇటీవల హీరో దర్శన్ తన మీద చేస్తున్న వ్యాఖ్యల విషయంలో తాను కలత చెందుతున్నానని డీకే శివకుమార్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. సమావేశం అనంతరం నిర్మాత ఉమాపతి మీడియాతో మాట్లాడుతూ డీకే శివకుమార్ తో తాను కొన్ని వ్యక్తిగత విషయాలు మాట్లాడానని చెప్పారు.

హీరో దర్శన్ చేస్తున్న ఆరోపణల విషయంలో డీకే శివకుమార్ జోక్యం చేసుకునే అవకాశం ఉందని నిర్మాత ఉమాపతి హింట్ ఇచ్చారు. కాటేరా సినిమాతో శ్యాండిల్ వుడ్ ఇండస్ట్రీకి భారీ హిట్ ఇచ్చిన హీరో దర్శన్ ఇదే సమయంలో ప్రముఖ నిర్మాత ఉమాపతిని నోటికి వచ్చినట్లు తిట్టి ఆరోపణలు మూటకట్టుకున్నారు. ఈ వివాదం ఎంతవరకు వెలుతుందో తెలియడం లేదని శ్యాండిల్ వుడ్ కు చెందిన కొందరు ప్రముఖులు అంటున్నారు. ఇదే సమయంలో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ఎంట్రీ ఇవ్వడంతో ఈ వివాదానికి చెక్ పడే అవాకశం ఉందని తెలిసింది.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ షెడ్యూల్ - ఫలితాల డేట్ ఫిక్స్..!!












Click it and Unblock the Notifications