సమంత చెప్పేది ఒకటి... చేస్తుంది మరొకటి?
మయోసైటిస్ తో వెండితెరకు ఏడాదిన్నరకు పైగా విరామం ప్రకటించిన సమంత హనీబన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈనెల ఏడోతేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రసారమవుతున్న ఈ సిరీస్ లో సమంత నటన చూసి ప్రేక్షకులేకాదు ఆమె అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. యాక్షన్ సన్నివేశాల్లో ఎంత బాగా నటించిందో అంతకుమించి బోల్డ్ సన్నివేశాల్లో నటించడంపై షాక్ అవుతున్నారు. దీనికి ముందు వచ్చిన ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్ లో కూడా ఇలాగే బోల్డ్ గా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
షాక్ అవుతున్న అభిమానులు
అయితే సోషల్ మీడియాలో హనీబన్నీలో సమంత ఇచ్చిన లిప్ కిస్ గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సన్నివేశం చూసిన తర్వాత యాక్షన్ సన్నివేశాల్లో ఆమె కనపరిచిన నటన గురించి అందరూ మర్చిపోయారు. ఒక సిరీస్ కు మించి మరో సిరీస్ అన్నట్లుగా అంతగా బోల్డ్ సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం ఏమొచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది మాత్రం మా సమంత ఎంత అందంగా ఉందో చూశారా? అంటూ ఆ సన్నివేశాన్ని షేర్ చేస్తున్నారు. అసలు ఇలాంటి సన్నివేశంలో సమంత నటిస్తుందని ఊహించడమే కష్టంగా ఉందంటూ ఆమె అభిమానులు బాధపడిపోతున్నారు. దీనికితోడు పుష్ప మొదటిభాగంలో చేసిన ఐటం సాంగ్ కూడా ఆమెపై వ్యతిరేకతను పెంచింది.

హనీబన్నీలో లిప్ కిస్
ఇలాంటి సన్నివేశాల్లో నటించడంవల్లే నాగచైతన్యకు, సమంతకు మధ్య విభేదాలు వచ్చి విడాకుల వరకు వ్యవహారం వెళ్లిందని వార్తలు వచ్చాయి. అటువంటి సన్నివేశాలకు దూరంగా ఉంటుందని అందరూ భావించారుకానీ హనీబన్నీలో తిరిగి బోల్డ్ సన్నివేశాలు చేయడంపై వ్యతిరేకతను పెంచింది. అబుదాబిలో జరిగిన ఐఫా అవార్డుల్లో పాల్గొన్న సమంత రానాను ఉద్దేశించి సినిమాలు చేస్తే నరసింహనాయుడిలా ఉండాలికానీ రానానాయుడిలా ఉండకూడదని వ్యాఖ్యానించింది. అయితే తిరిగి రానా కౌంటర్ ఇచ్చారు. ఫ్యామిలీమ్యాన్ సిరీస్ చూసిన తర్వాతే నేర్చుకున్నానక్కా అంటూ సమాధానమిచ్చాడు. ఈ కార్యక్రమం జరిగిన కొద్దిరోజులకు ఈ వ్యాఖ్యలు బాగా వైరలవుతున్నాయి. అసలు ఆమె మాటలకు అర్థాలేమిటి అనేది ఆమెకే తెలియాలి.












Click it and Unblock the Notifications