ఏంటి..ఆ జబర్దస్త్ నటుడు రూ.200 కోట్లకు అధిపతా..?
టెలివిజన్ రంగంలో జబర్దస్త్ షో సరికొత్త ట్రెండ్ సృష్టించిందనే చెప్పాలి. ప్రేక్షకులకు సరికొత్త కామెడీని అందించడంలో జబర్దస్త్ షో సూపర్ సక్సెస్ అయింది. జబర్దస్త్ ద్వారా చాలామంది ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. నాగబాబు, రోజా వంటి వారు కూడా జబర్దస్త్ షో ద్వారా తమ పాపులారిటీని మరింత పెంచుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలవడానికి జబర్దస్త్ షో కూడా ఓ కారణమని రోజా చెప్పారంటే ఆ షో ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన వారి సంఖ్య వందల్లోనే ఉంటుంది. గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్, షకలక శంకర్ వంటి వారు జబర్దస్త్ షోతో వచ్చిన గుర్తింపుతో సినిమాల్లో కూడా నటించారు. ఇక సుడిగాలి సుధీర్ అయితే జబర్దస్త్ షోతో బుల్లితెర మెగాస్టార్‌గా మారిపోయాడు. సుధీర్ ఇప్పుడు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. ఇక షోలో యాంకరింగ్ చేసిన అనసూయ, రష్మీ కెరీర్ ఎలా దూసుకుపోతుందో అందరికి తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ జబర్దస్త్ నటుడు గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. అతను మరెవరో కాదు.. కొమురక్క అలియాస్ కుమార్. ఒకప్పుడు జబర్దస్త్ లో మహిళల గెటప్‌లకు మంచి డిమాండ్ ఉండేది. ఇప్పుడు మహిళా కమెడియన్లు మాత్రమే నేరుగా వస్తున్నారు. కానీ ఒకప్పుడు పురుషులు మాత్రమే మహిళల గెటప్ లు వేసుకునేవారు. అలా కుమార్ కూడా మహిళల గెటప్ లు వేసుకుని 'కొమురక్క'గా పాపులర్ అయ్యాడు.
తాజాగా మనోడు.. ఓ యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ.. తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించడం జరిగింది. గతంలో అతను చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కున్నానని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు . మొదట్లో చార్మినార్, కామత్, ఉడిపి వంటి అనేక హోటళ్లలో పనిచేశానని చెప్పుకొచ్చాడు. తాను ఎనిమిది సంవత్సరాలు ఆ హోటళ్లలో పనిచేసానని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార్ ఈ విషయాలను పంచుకున్నారు.
ఆ సమయంలో, తన తండ్రికి ఇరవై ఎకరాల భూమి ఉందని అప్పులు ఎక్కువ కావడంతో... అతను దానిని అమ్మేశాడని కొమ్రక్క తెలిపాడు. చివరికి, కేవలం ఐదు ఎకరాలు మాత్రమే మిగిలింది. దీంతో ఎలాగైనా ఆ భూమిని సంపాదించాలనుకున్నానని తెలిపాడు. చాలా కష్టపడి పనిచేశానని. ఎక్కువ ఖర్చు చేయకుండా, సంపాదించిన డబ్బునంతా భూమి కోసం ఖర్చు చేశానని తెలిపాడు. అలా తిరిగి తన భూమిని కొనుగోలు చేశానని కుమార్ వెల్లడించాడు.
ఇప్పుడు అక్కడ విమానాశ్రయం రాకతో, అక్కడ భూమి ధరలు పెరిగాయి. దీనితో, కొమ్రక్క అలియాస్ కుమార్ కోటీశ్వరుడు అయ్యాడు. ప్రస్తుతం ఆ భూమి విలువ రూ.200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
-
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
NTRNeel: వాడి బాడీ బాక్సాఫీస్ రా: `హెర్కులెస్`.. !! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
అలా అమరావతిలో.. కొత్త సినిమా కోసం పవన్ కళ్యాణ్ నయా ప్లాన్ !! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
పాన్ ఇండియా సినిమాలో బోల్డ్ సీన్.. చేయనని మొండికేస్తున్న స్టార్ హీరోయిన్! -
యాంకర్ విష్ణుప్రియకి బిగ్ షాక్.. క్రిమినల్ కేసు?? -
తప్పు తప్పు.. అంతకు ముందు అలా చేయలేదా ?? అనసూయ పోస్ట్ వైరల్ !! -
నమ్మినోడే.. ముంచేశాడుగా.. టాలీవుడ్ బడా నిర్మాతకు వెన్నుపోటు !!









Click it and Unblock the Notifications