HanuMan Part 2: షూటింగ్ బిగిన్: శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటీ?
Hanu Man: టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా హీరోగా నటించిన తాజా చిత్రం హనుమాన్. మైథలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ.. సంక్రాంతి రేసులో హీరోగా నిలిచింది. టాప్ హీరోలు నటించిన సినిమాలన్నింటి కంటే భారీ కలెక్షన్లను రాబట్టుకుంటోంది. విడుదలైన 10 రోజులు దాటిపోయిన కలెక్షన్ల సునామీ తగ్గట్లేదు.
విడుదలైన ఈ 10 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల రూపాయల కలెక్షన్లను రికార్డు చేసింది. హనుమాన్ ఏ స్థాయిలో హిట్ అయిందో చెప్పడానికి ఈ లెక్కలు చాలు. తేజా సజ్జా హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీ ఇదే. సోలో హీరోగా జోంబీ రెడ్డి, ఇష్క్, అద్భుతం మూవీల్లో నటించాడు తేజా. అవేవీ ఆశించిన స్థాయిలో గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి.

దాదాపుగా రెండు సంవత్సరాల గ్యాప్ తరువాత హను మాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదరగొట్టాడు. ఈ సినిమాతో స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు. అమృత నాయర్, వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ షెట్టి, వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించారు. ప్రశాంత్ వర్మ దర్శకుడు. ప్రైమ్ షో పతాకంపై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాకు రెండో పార్ట్‌పై అప్ డేట్ వెలువడింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా జై హనుమాన్ బౌండ్ స్క్రిప్ట్‌కు పూజలు చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

జై హనుమాన్ పేరుతో ఈ సినిమా రెండో భాగం తెరకెక్కుతుంది. 2025లో దీని సీక్వెల్ విడుదల అవుతుంది. 2025 సంక్రాంతి నాటికి రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కింద రెండో భాగం తెరకెక్కుతుంది. శ్రీరామచంద్రుడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం ఏమిటీ? అనే కాన్సెప్ట్‌తో సినిమా చిత్రీకరణ జరుపుకోనుంది.
जय श्री राम 🙏
— Mythri Movie Makers (@MythriOfficial) January 22, 2024
With the divine blessings of Lord Shree Ram, #HanuManRAMpage continues to soar higher at the Box-office ❤️🔥
2️⃣0️⃣0️⃣ CRORE WORLDWIDE collections for #HANUMAN in just 10 Days 🔥💥
Nizam Release by @MythriOfficial ❤️🔥
A @PrasanthVarma film
🌟ing @tejasajja123… pic.twitter.com/S1gjf0RKYr
ఇప్పుడున్నఈ సినిమాకు రెండో పార్ట్‌పై అప్ డేట్ వెలువడింది. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్లు యూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా జై హనుమాన్ బౌండ్ స్క్రిప్ట్‌కు పూజలు చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.












Click it and Unblock the Notifications