హైదరాబాద్ ఎయిర్ పోర్టులో జైలర్ విలన్ వినాయకన్ అరెస్ట్

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'జైలర్' సినిమాలో విలన్ వినాయకన్‌ను ఎయిర్‌పోర్టు పోలీసులు అరెస్ట్ చేశారు.మద్యం మత్తులో ఉన్న వినాయకన్.. శంషాబాద్ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్నారు. దీంతో సదరు కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు పోలీసులు వినాయకన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు, మద్యంమత్తులో ఉన్న వినాయకన్ తమపై కూడా దాడి చేశారని పలువురు అధికారులు కూడా ఫిర్యాదు చేశారు. ఇది ఇలావుంటే, తాను ఎలాంటి తప్పు చేయలేదని వినాయకన్ చెప్పుకొచ్చాడు. సీఐఎస్ఎఫ్ అధికారులు తనను విమానాశ్రయంలోని ఓ గదిలోకి తీసుకెళ్లి దాడి చేశారని వినాయకన్ ఆరోపించారు. కావాలంటే సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని కోరాడు.

Jailer villain Vinayakan arrested at Hyderabad airport

కాగా, వినాయకన్‌కు వివాదాలేమీ కొత్తేం కాదు. గత ఏడాది అక్టోబర్ నెలలో కేరళ పోలీసులు వినాయకన్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఎర్నాకుళం టౌన్ నార్త్ పోలీస్టే స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో పలువురితో గొడవకు దిగారు. మద్యం మత్తులో తమ అపార్ట్‌మెంట్‌లో న్యూసెన్స్ చేస్తున్నారని, తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పొరుగువారు ఫిర్యాదు చేయడంతో వినాయకన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

మొదట వినాయన్‌కు పోలీసులు మర్యాదగా నచ్చజెప్పేందుకు ప్రయత్నం చేసినా వినకపోవడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, మలయాళ సినీ పరిశ్రమలో ఎక్కువ సినిమాలు చేసిన వినాయకన్.. రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో విలన్ పాత్రతో పాపులర్ అయిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+