"హరిహర వీరమల్లు" హిట్ కోసం కార్యకర్తలు కష్టపడాలట .. కూటమి ఎమ్మెల్సీ సంచలనం
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' విడుదలకు సిద్ధమవుతుండగా, ఈ సినిమా చుట్టూ రాజకీయ చర్చ మొదలైంది. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు, కూటమి నాయకులు ఈ సినిమా విడుదలపై హాట్ కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా, జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కూడా ఈ విషయంపై స్పందించి, జనసేన కార్యకర్తలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ, 'హరిహర వీరమల్లు' సినిమాను విజయవంతం చేయడానికి జనసేన కార్యకర్తలంతా కష్టపడాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడూ లాభాల కోసం సినిమాలు చేయరని గుర్తుచేసిన ఆయన, ఇది ఒక చారిత్రాత్మక చిత్రం అని పేర్కొన్నారు. ఈ సినిమాలోని సందేశాన్ని ప్రజలకు చేరవేసేలా జనసేన కార్యకర్తలు పనిచేయాలని ఆదేశించారు.

ఈరోజు, జులై 23వ తేదీ రాత్రి నుండే ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయని, అలాగే జులై 24వ తేదీన టికెట్లు దొరకని వారికి సౌకర్యాలు కల్పించాలని జయమంగళ వెంకటరమణ స్పష్టం చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.ఈ చారిత్రక యాక్షన్ చిత్రం గురువారం అధికారికంగా విడుదల కానుండగా, అభిమానుల కోలాహలం మధ్య బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.












Click it and Unblock the Notifications