పీరియడ్స్ టైంలో బాయ్ ఫ్రెండ్‌తో అలా.. జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్స్
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు నుంచే ఈ అమ్మడు విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. జాన్వీ కపూర్‌ను స్టార్ హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి కలలు కన్నారు. కాని ఆ కోరిక తీరకుండానే ప్రమాదవశాత్తు ఆమె మరణించారు. జాన్వీ కపూర్ హిందీలో 2018లో వచ్చిన ధడక్ సినిమా ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికి అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయాలు సాధించలేదు. అయినప్పటికి జాన్వీ కపూర్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. పైగా ఆమె ఫాలోయింగ్ గతంలో కంటే ఇప్పుడు మరింత పెరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ కపూర్.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.

జాన్వీ కపూర్ హాట్ ఫోజులకు కుర్రకారు నిద్ర లేకుండా గడిపిన రోజులు చాలానే ఉన్నాయంటే అతిశేయోక్తి కాదు. ఇదిలా ఉంటే జాన్వీ కపూర్ తాజాగా సంచలన కామెంట్స్ చేసింది. తన పర్సనల్ విషయాలను ఆమె బహిరంగంగా వెల్లడించింది. శిఖర్ షిండే అనే వ్యక్తితో జాన్వీ కపూర్ రిలేషన్‌లో ఉండేదని గతంలో వార్తలొచ్చాయి. శిఖర్ షిండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు.
అతనితో జాన్వీ కపూర్ కొన్నాళ్లు డేటింగ్ చేసింది. అయితే కొన్నాళ్లకే శిఖర్ షిండేకు జాన్వీ కపూర్ బ్రేకప్ చెప్పింది. తాజాగా దీనిపై స్పందిస్తూ...తాను లైఫ్‌లో ఒక్కసారి మాత్రమే ప్రేమలో ఫెయిల్ అయ్యానని చెప్పుకొచ్చింది.ప్రతి నెల నాకు పీరియడ్స్ సక్రమంగానే వచ్చేవి. కాని బ్రేకప్ తర్వాత నా శరీరంలో హార్మోన్ల మార్పు కనిపించిందని, దీంతో రెండు మూడు నెలల వరకు మూడీగా ఉండేదానని తెలిపింది.
ఆ సమయంలో నా మైండ్ ఎందుకు అలా పని చేస్తుందో తెలియక చాలా ఇబ్బందికి గురయ్యానని జాన్వీ తెలిపింది. ప్రస్తుతం అంతా బాగానే ఉందని చెబుతూ పాత రోజులను మళ్లీ గుర్తు చేసుకుంది. ఇక జాన్వీ కెరీర్ విషయానికి వస్తే...బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తోంది. ఎన్టీఆర్‌తో దేవర సినిమాతో పాటు, రామ్ చరణ్ చేస్తోన్న కొత్త సినిమాలో కూడా జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు బాలీవుడ్‌లో మరో రెండు సినిమాలకు సైతం అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications