నారా రామ్మూర్తినాయుడి విషయంలో సరిదిద్దుకోలేని తప్పు చేసిన ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్
తెలివితేటలు ఎక్కువైనా, తమంతట తమకు పెద్దరికం వచ్చినా ఎవరిమాటా వినే పరిస్థితి ఉండదని పెద్దలు అంటుంటారు. సరిగ్గా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌కు కూడా ఈ మాటను అన్వయించుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కొద్ది సంవత్సరాలుగా చంద్రబాబునాయుడితో, బాలకృష్ణ, లోకేష్ తో వీరిద్దరికీ దూరం ఉంది. రోజురోజుకు అది పెరుగుతుందేకానీ తగ్గడంలేదు. నారా కుటుంబం, బాలకృష్ణకు, తారక్, కల్యాణ్ రామ్ కు మధ్య సయోధ్య కుదర్చాలని పెద్దలు ప్రయత్నాలు చేయబోయారుకానీ వీలవలేదు. చంద్రబాబును అరెస్ట్ చేసిన సమయంలో కూడా ఈ అన్నదమ్ములిద్దరూ స్పందించలేదు. హరికృష్ణ జీవించివున్న సమయంలో బాలయ్య వీరిద్దరినీ బాగా చేరదీశారు. తర్వాత ఏ కారణాలవల్లో తెలియదుకానీ అంతులేని దూరం పెరిగింది.
టికెట్ ధరలు పెంచుకున్నారు
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ట్వీట్ చేసి సరిపెట్టారు. తారక్ ట్వీట్ కు చంద్రబాబు తిరిగి సమాధానం ఇచ్చారు. థాంక్యూ అమ్మా అన్నారు. ఇటీవలే దేవర సినిమా విడుదలైతే టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తాజాగా చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తినాయుడు మరణించారు. ఆయన అంత్యక్రియలను స్వగ్రామం నారావారిపల్లెలో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. సోదరుడి పాడె మోసి చంద్రబాబు రుణం తీర్చుకున్నారు. సోమవారం సాయంత్రం వరకు చిన్న కర్మ అయ్యేవరకు అక్కడే ఉంటారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా అందరూ రామ్మూర్తినాయుడి మృతికి సంతాపం తెలియజేశారు.

ఆసుపత్రికి కూడా వెళ్లినట్లు లేరు
జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ మాత్రం ఇంతవరకు కనీసం స్పందించలేదు. అంత్యక్రియలకు కూడా హాజరుకాలేదు. ట్వీట్ కూడా చేయలేదు. కావాలని చేయలేదా? లేదంటే మరెందుకో తెలియదని వీరి సన్నిహితులు అంటున్నారు. పరిశ్రమలో తనకు సన్నిహితంగా ఉండేవారికి తరుచుగా ట్వీట్ చేసే తారక్ తన బంధువు మరణిస్తే ఎందుకు ట్వీట్ చేయలేదు? ఎందుకు మృతదేహానికి నివాళులు అర్పించలేదు? ఎందుకు వారి కుటుంబ సభ్యులను కలవలేదు? అనే విషయంలో స్పష్టత లేదు. కారణం వారిద్దరికే తెలియాలి. ఆసుపత్రికి కూడా ప్రముఖులు వెళ్లివచ్చారు. వీరిద్దరూ ఆసుపత్రికి వెళ్లారా? లేదా? అనే విషయం మాత్రం బయటకు రాలేదు. ఆసుపత్రికి కూడా వెళ్లలేదని కొందరు అంటున్నారు. వీరిద్దరి అభిప్రాయాలేమిటి? వీరి నిర్ణయాలేమిటి? అనేవి వారికే తెలియాలి.












Click it and Unblock the Notifications