సినిమా ఎక్కేసింది.. రూ.300 కోట్ల క్లబ్‌లోకి 'దేవర'

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా నటించిన చిత్రం దేవర. అభిమానులు బాగా ఆకలితో ఎన్టీఆర్ సినిమా కోసం ఎదురుచూడగా వారి ఆకలిని ఈ సినిమా తీర్చినట్లే కనపడుతోంది. కొందరు బాగుందంటున్నారు.. మరికొందరు యావరేజ్ అంటున్నారు.. ఇలా టాక్ తో సంబంధం లేకుండా మరోవైపు కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తోంది. తాజాగా దేవర రూ.300 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటిరోజు రూ.172 కోట్లు రాబట్టగా, రెండోరోజు రూ.71 కోట్లు రాబట్టింది.

రూ.304 కోట్లు వచ్చాయి
ఈ రెండురోజులకు రూ.243 కోట్లు రాబట్టిన దేవర మూడోరోజు ఆదివారం కావడంతో రూ.61 కోట్లు రాబట్టింది. మొత్తం మూడురోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లతో రూ.304 కోట్లు కొట్టగొట్టింది. తన కెరీర్ లో జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వచ్చి అత్యధిక కలెక్షన్లు అందుకున్న చిత్రం ఇదే కావడం విశేషం. సోమవారం కలెక్షన్లు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. తిరిగి మంగళవారం అక్టోబరు రెండు గాంధీ జయంతి సెలవు దినం కావడంతో కలెక్షన్లు పెరుగుతాయని, తర్వాత మూడో తేదీ నుంచి 12వ తేదీ వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి.

junior ntr devara movie joined 300 crore rupees club

అప్పటివరకు దేవరకు ఢోకా లేదు
అప్పటివరకు దేవరకు ఎటువంటి ఢోకా ఉండదని, భారీగానే కలెక్షన్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ రూ.300 కోట్ల బడ్జెట్ తో దీన్ని నిర్మించారు. చైనా, రష్యాలో కూడా సినిమాను విడుదల చేశారు. తారక్ నటనతోపాటు అనిరుధ్ బీజీఎం సినిమాను మరోస్థాయిలో నిలబెట్టాయని చెప్పొచ్చు. ఈ రెండు అంశాలే దేవరకు ప్రాణమంటున్నారు. మొదటి భాగం బాగున్నప్పటికీ రెండోభాగం సాగదీశారని, రెండు భాగాలుగా కాకుండా సినిమా మొత్తాన్ని ఒక భాగంగానే తీసివుంటే చాలా సులువుగా రూ.1500 కోట్లు కొట్టగొట్టేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+