జూనియర్ ఎన్టీఆర్ కు తీరని కోరిక!
ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా మారిపోయారు జూనియర్ నందమూరి తారక రామారావు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రం చేస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడం, హిందీ భాషలతోపాటు డబ్బింగ్ చేసి ఇంగ్లిషులో కూడా విడుదల చేయాలనే యోచనలో దర్శక, నిర్మాతలున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ దాదాపు రూ.100 కోట్లకు అటో ఇటో ఉంది. ఎన్ని కోట్లరూపాయలు ఉన్నా ఉపయోగం ఏముందని జూనియర్ నిట్టూరుస్తున్నాడు. ఎందుకంటే అతనికి ఇద్దరూ కొడుకులే పుట్టారు. తారక్ కు ఆడపిల్ల మీద ఎంతో ఇష్టం. మొదటిసారి డెలివరీ అయినప్పుడు అమ్మాయి పుడుతుందని ఆశపడ్డాడుకానీ కోరిక నెరవేరలేదు.

అలాగే రెండోసారి కొడుకే పుట్టడంతో జూనియర్ నిరాశ పడ్డారు. మూడోసారి అమ్మాయి పుడుతుందని గట్టిగా నమ్మకంతో ఉన్నప్పటికీ అతని భార్య లక్ష్మీప్రణీత ఆరోగ్యరీత్యా మూడోసారి డెలివరీ అవడంవల్ల ఆమె ప్రాణాలకు ప్రమాదమని చెప్పడంతో జూనియర్ తన కోరికను వదిలేశాడు.
ఇంట్లో కాళ్లకు పట్టాలు పెట్టుకొని ఆడపిల్ల తిరుగుతుంటే ఆ లక్ష్మీకళే వేరని జూనియర్ తరుచూ తన సన్నిహితుల దగ్గర మాట్లాడుతుండేవారు. కోట్లరూపాయల ఆస్తి, మంచి కుటుంబం, ఇద్దరు కొడుకులు... ఇలా అన్నీ ఉన్నా ఆడపిల్ల లేనిలోటు మాత్రం లోటేనని తారక్ వ్యాఖ్యానిస్తుంటారు.
ఈ వార్త సోషల్ మీడియాలో వైరలవుతుండటంతో జూనియర్ అభిమానులు తమ నాయకుడికి ఆడపిల్లను కూడా ఇస్తే బాగుండేదని కామెంట్లు పెడుతున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న దేవర సినిమాలో తారక్ ప్రతి సీన్ లో అత్యద్భుతంగా నటిస్తున్నాడని టాక్. దీనిద్వారా ఇంకెన్ని రివార్డులు, అవార్డులు అందుకుంటాడో చూడాలి.












Click it and Unblock the Notifications