కాకినాడ "శ్రీదేవి" మళ్లీ వచ్చేస్తుందోచ్.. కోర్టు కాంబో రిపీట్ !!
టాలెంట్ నుంచి ఏదైనా సాధించవచ్చు అని ఎంతో మంది నిరూపించి చూపించారు. ఇన్ స్టా గ్రామ్ రీల్స్, యూట్యుబ్ లో షార్ట్ ఫిల్మ్స్ తో సత్తా ఛాతీ వెండితెరపై కూడా ఎంతో మంది అలరిస్తున్నారు. ఈ కోవకే చెందుతారు "కోర్టు" సినిమా నటీనటులు. తెలుగు సినీ పరిశ్రమలో చిన్న సినిమాగా వచ్చి భారీ హిట్ కొట్టిన మూవీస్ చాలానే ఉన్నాయి. అలాంటి అరుదైన విజయాన్ని అందుకున్న చిత్రం 'కోర్ట్'. అతి తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా.. విమర్శకుల ప్రశంసలు కూడా సొంతం చేసుకుంది.
నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో.. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, పోక్సో చట్టం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన కథతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా చూసిన తరువాత స్టార్ హీరోలు కూడా ఇందులో నటించిన నటీనటుల అభినయంపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాలో కాకినాడ శ్రీదేవి (అలియాస్ శ్రీదేవి అప్పాల) మరియు హర్ష్ రోషన్ జంటగా నటించారు. అలా ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా తొలి సినిమా అవకాశం సాధించింది ఫేమస్ అయింది శ్రీదేవి.

ఈ సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఈ మూవీలో జాబిలి పాత్రలో శ్రీదేవి యాక్టింగ్ కు యూత్ ఫిదా అయిపోయారు. జాబిలి పాత్రలో శ్రీదేవి చూపించిన సహజమైన నటన, అమాయకత్వం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. దాంతో యూత్ నుంచి సోషల్ మీడియాలో వరకూ ఆమెకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. రోషన్ కూడా తన పాత్రకు న్యాయం చేస్తూ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. ఈ జంట సహజత్వం, కెమిస్ట్రీ సినిమా విజయానికి కీలక కారణమయ్యాయి.
కొత్త సినిమా 'బ్యాండ్ మేళం'..
కాగా కోర్ట్ విజయంతో వచ్చిన బజ్‌ను కొనసాగిస్తూ, ఈ జంట ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ దర్శకుడు సతీష్ జవ్వాజి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పేరు 'బ్యాండ్ మేళం'. తాజాగా మేకర్స్ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. గ్లింప్స్ మొదలవ్వగానే "రాజమ్మా" అని యాదగిరి పిలిచే వాయిస్‌ఓవర్ వినిపిస్తుంది.
ఆ తర్వాత బావ-మరదళ్ల మధ్య జరిగే ఆసక్తికరమైన సంభాషణతో విజువల్స్ కొనసాగుతాయి. "నీకోసం కొత్త ట్యూన్ సేసినా" - "నా కోసమా సరే షురూ జెయ్" అనే డైలాగ్‌లతో పక్కా తెలంగాణ యాసలో ఈ గ్లింప్స్‌ని డిజైన్ చేశారు. చివరగా "ఈ యాదగిరి వాయిస్తే బోనగిరి దాక ఇనిపిస్తది సూడు" అనే మాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నారు.
అంతే కాకుండా శ్రీదేవి ఒక తమిళ సినిమాలోనూ నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మూవీ ఇటీవల ప్రారంభమవ్వగా.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి ఈ సినిమాతో కూడా ఈ జంట ప్రేక్షకులను మెప్పిస్తారో లేదో అని.
-
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
సొంత సినిమాను వదిలేసి పరాయి సినిమాకు భజనా? -
ఐ లవ్డ్ ధురంధర్ 1.. బట్ - జక్కన్న సెన్సేషన్ రివ్యూ: అలాంటి హీరోలందరినీ చంపేసింది -
కుటుంబ సభ్యులతో కలిసి "ఉస్తాద్ భగత్ సింగ్" మూవీ చూసిన మెగాస్టార్.. -
ఉస్తాద్‌కు ధురంధర్ డెంటు పెట్టేసాడుగా..! -
ఓటీటీని షేక్ చేస్తున్న చిన్న సినిమా.. హీరో కూడా లేడు !! -
థియేటర్ల దగ్గర తొలిసారిగా 144 సెక్షన్, భారీగా పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపు ఈ హీరో సినిమాకే -
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న తెలుగు హీరోయిన్.. వైజాగ్‌లో సందడి !! -
ఉస్తాద్‌కు బిగ్ షాక్...తొలి రోజే ఆన్లైన్లో HD ప్రింట్ ప్రత్యక్షం! -
స్టార్ బ్యూటీతో కలిసి సైలెంట్‌గా ఓటీటీ డెబ్యూ ఇస్తున్న యంగ్ హీరో !! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మీకు అర్థమవుతోందా?.. ‘ధురంధర్2’ తీయడం వెనక పక్కా రాజకీయ వ్యూహం












Click it and Unblock the Notifications