రజినీకాంత్ "కూలీ" మూవీలో కమల్ హాసన్.. ఇక రికార్డులు బద్దలే !

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం "కూలీ". ఈ సినిమాకి యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్-ఇండియా స్థాయిలో అత్యంత భారీ మల్టీస్టారర్ గా రాబోతుంది ఈ మూవీ. ఈ చిత్రాన్ని ఆగస్టు 14, 2025న విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో శ్రుతి హాసన్, పూజా హెగ్డే లాంటి ప్రముఖ హీరోయిన్లు కూడా నటిస్తున్నారు.

ఐదు భాషల స్టార్ హీరోలు..

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో.. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లోని స్టార్ నటులు కలిసి నటిస్తున్నారు. తెలుగు నుంచి నాగార్జున, కన్నడ నుంచి ఉపేంద్ర, మలయాళం నుంచి సౌబిన్ షాహిర్, బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్.. తమిళ నటుడు సీనియర్ నటుడు సత్యరాజ్ కూడా భాగమయ్యారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దాంతో భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

kamal-haasan-cameo-in-rajini-kanth-coolie-movie

3 నిమిషాల కంటే ఎక్కువ నిడివి ఉన్న ఈ ట్రైలర్‌.. యాక్షన్‌, ఎమోషన్‌, మిస్టరీ, రివేంజ్ థీమ్‌లు కలిపినట్టు ఉంది. రజనీ మాస్ క్యారెక్టర్ గా చూపించే ప్రయత్నం చేశాడు లోకేష్. అలానే నాగార్జున, అమీర్ ఖాన్ కూడా అదరగొట్టేశారు. అనిరుధ్ వాయిస్ ఓవర్‌తో చూపించడం.. ట్రైలర్‌కు కొత్తదనాన్ని తీసుకొచ్చింది.

క్యామియోగా కమల్ హాసన్..?

అయితే ఈ "లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)" లో భాగంగా ఈ సినిమాకి కూడా లింక్ ఉండబోతోంది అని టాక్ నడుస్తోంది. ఖైదీ, విక్రమ్ సినిమాలకు ఎలా అయితే లింక్ చేసారో.. అలానే ఈ మూవీ కూడా విక్రమ్ తో లోకి చేస్తారని.. గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకు తగ్గట్టుగానే.. ట్రైలర్‌లో శ్రుతిహాసన్ చెప్పిన డైలాగ్ ("మీకు వాడు ఫ్రెండ్ కావచ్చు, నాకు నాన్న") అని.. కమల్ హాసన్ సినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. గతంలో "విక్రమ్" అనే క్యారెక్టర్‌లో కనిపించగా, ఇందులో కూడా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ కారణంగా అదే పాత్రగా కనిపించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దాంతో రజినీ- కమల్ కలిసి కనిపిస్తే రికార్డులు బద్దలవ్వడం గ్యారంటీ అని ఖుషి అవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+