Karthika deepam 2 October 29th:దీప అరెస్ట్...జ్యోత్స్న ప్లాన్ సక్సెస్!
తమ ప్లాన్‌లో భాగంగా శివన్నారాయణ ఒత్తిడితో దశరథ్‌కు తోడుగా కార్తీక్‌ను గుడికి పంపడం, తాత-మనవళ్ల సైగలు పారిజాతంకు అనుమానం పెంచాయి. మరోవైపు, ఉద్యోగం దొరకలేదనే నిజం స్వప్నకు తెలియకుండా ఉండాలని కాశీ తంటాలు పడతాడు. జ్యోత్స్న ప్లాన్ ప్రకారం సుమిత్ర కనిపించలేదని దీప ఇంటికి పోలీసులతో వెళ్లడం, గుడిలో దశరథ్‌ను చూసి సుమిత్ర షాక్ అవ్వడం గత ఎపిసోడ్ ముగిసింది.
నేటి 501వ ఎపిసోడ్ హైలైట్స్ (అక్టోబర్ 29)
గుడిలో సెంటిమెంట్ డ్రామా: గుడిలో దశరథ్‌ను చూసిన సుమిత్ర పక్కకు వెళ్లి దాక్కుంటుంది. ఆమె జడలో నుంచి జారిన పూలను చూసిన దశరథ్ వాటిని జాగ్రత్తగా పక్కన పెడతాడు. తమ అత్తయ్య, మావయ్య పేరు మీద అర్చన చేయించమని కార్తీక్ అడగగా, అదే పేర్లతో ఇంతకుముందే ఒకరు అర్చన చేయించారని పంతులు చెప్పడంతో తండ్రీకొడుకులు షాక్ అవుతారు. సుమిత్ర తనను వదులుకున్నా, పెళ్లిరోజును మరిచిపోలేదని దశరథ్ బాధపడతాడు. దశరథ్ పెట్టిన బొట్టు కిందపడగా, సుమిత్ర పక్కన పెట్టిన బొట్టునే అతను పెట్టుకోవడంతో సుమిత్ర భావోద్వేగానికి లోనవుతుంది.

దశరథ్‌లో పశ్చాత్తాపం:
దశరథ్ తన బాధను కార్తీక్‌తో పంచుకుంటూ, తన పంతం వల్లే ప్రేమించిన మనిషిని దూరం చేసుకున్నానని కుమిలిపోతాడు. దీప మీదున్న కోపంతోనే సుమిత్ర తాళి తీసిందని, తనపై గౌరవం లేక కాదని కార్తీక్ ధైర్యం చెబుతాడు. భార్యాభర్తలు జీవితాంతం కలిసి బతకాల్సిందేనని దశరథ్ గుడి దీపాలను చూసి అంటాడు. ఇంతలో రెండు ఒత్తుల్లో ఒకటి ఆరిపోవడంతో "సుమిత్రకు ఏమీ కాలేదు కదా?" అని దశరథ్ తీవ్ర ఆందోళన చెందుతాడు. వెంటనే ఆ దీపం వెలగడంతో ఊపిరి పీల్చుకుంటాడు. ఇంతలో కార్తీక్ దాక్కున్న సుమిత్రను చూస్తాడు.
జ్యోత్స్న దుశ్చర్య:
దీప అరెస్ట్! దీప ఇంట్లో సుమిత్ర కనిపించకపోవడంతో జ్యోత్స్న మరింత రెచ్చిపోతుంది. "మా మమ్మీని నువ్వే కిడ్నాప్ చేసి ఇంట్లో దాచావు" అంటూ ఆరోపిస్తుంది. దీప ప్రతిఘటించగా, కోడలిపై చెయ్యెత్తబోయిన జ్యోత్స్నను కాంచన గట్టిగా అడ్డుకుంటుంది. "నా మేనకోడలి కంటే నా కోడలే ఎక్కువ" అని తేల్చి చెబుతుంది.దీపను అరెస్ట్ చేయమని జ్యోత్స్న పోలీసులను బలవంతం చేస్తుంది. గతంలో దీప తన తండ్రిని షూట్ చేసిందని, వారిద్దరికీ పడదని చెబుతుంది. పోలీసులు దీపను అరెస్ట్ చేయబోగా, "ముందు నన్ను అరెస్ట్ చేయండి" అని కాంచన అడ్డుపడుతుంది. అయితే, చివరకు పోలీసులు దీపను అరెస్ట్ చేయడంతో కాంచన, దీపలు షాక్ అవుతారు.
తరువాత ఏం జరుగుతుంది? జైలుకెళ్లిన దీపను కార్తీక్ ఎలా రక్షిస్తాడు? గుడిలో సుమిత్ర-దశరథ్‌లను కార్తీక్ ఎలా కలుపుతాడు? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ చూడాల్సిందే.












Click it and Unblock the Notifications