ఈ యంగ్ హీరో ఏమైపోయాడో.. రెండేళ్ల నుంచి నో అప్డేట్ !!
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించిన హీరోలలో ఈయన కూడా ఒకరు. యంగ్ హీరోల్లో నాని, విజయ్ దేవరకొండ తరహాలో కార్తికేయ కూడా స్టార్ హీరో అవుతారని అంతా భావించారు. RX 100 చిత్రంతో హీరోగా పరిచయమైన కార్తికేయ తన నటన, డ్యాన్స్, ఫైట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ సినిమాలో కార్తికేయ కటౌట్ చూసి..మరో ప్రభాస్ వచ్చాడని ఆడియన్స్ మురిసిపోయారు.
అయితే ఆ తర్వాత 'హిప్పి', 'గుణ 369', '90 ఎంఎల్'.. ఇలా హీరోగా వరుసగా సినిమాలు చేశారు. కానీ వీటిలో ఏ ఒక్క సినిమా 'RX 100' స్థాయి హిట్‌ను అందించలేకపోయాయి. కానీ 90ML, 'చావు కబురు చల్లగా', బెదురులంక 2012 చిత్రాలు కమర్షియల్‌గా మంచి ఫలితాలను అందుకున్నాయి. కార్తికేయ చివరిసారిగా కనిపించిన చిత్రం భజే వాయు వేగం. ఈ చిత్రం 2024లో విడుదలై యావరేజ్ గా నిలిచింది.

విలన్ గా మెప్పించిన యంగ్ స్టార్..
అలానే కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా, విలన్ పాత్రల్లోనూ తన ప్రతిభను చూపించారు. గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని హీరోగా నటించగా, కార్తికేయ విలన్ గా రచ్చ రచ్చ చేశాడు. . అలాగే తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వలిమై సినిమాలో కూడా విలన్‌గా నటించి గుర్తింపు పొందారు. ఇలాగే వరుస సినిమాలతో పెద్ద స్థాయికి ఎదుగుతారని ఆడియన్స్ భావించారు. ప్రేక్షకులకు దగ్గరవుతున్న సమయంలో ఆయన అకస్మాత్తుగా సినిమాల నుండి దూరమయ్యారు.
సడెన్ గా స్క్రీన్ నుంచి మాయమై షాక్ ఇచ్చాడు యంగ్ హీరో. ప్రస్తుతం ఈ యంగ్ హీరో ఏం చేస్తున్నాడు.. ఎక్కడున్నాడు ?? అని సోషల్ మీడియా వేదికగా జోరుగా చర్చ నడుస్తోంది.












Click it and Unblock the Notifications