రాజకీయాలు అంటే నాకు?, ఎప్పుడు ఏం చెయ్యాలో తనకు బాగా తెలుసు, రాఖీభాయ్!

రాకింగ్ స్టార్ యష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఫిట్‌నెస్ ట్రైనర్ కిట్టి కొత్త వెంచర్ కిట్టీస్ మజిల్ ప్లానెట్ జిమ్‌ను కేజీఎఫ్ హీరో యష్ బెంగళూరులో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యష్ తన ఫిట్‌నెస్ ట్రైనర్ పానీపూరి కిట్టి గురించి చాలా మాట్లాడాడు. పానీపూరి కిట్టి చాలా ఏళ్లుగా యష్ ట్రైనర్‌గా ఉన్నారు. రాకింగ్ స్టార్ యష్ ఇంత ఫిట్ నెస్ తో ఉన్నారంటే పానీపూరి కిట్టీ కారణం అని హీరో సన్నిహితులు అంటుంటారు.

అలా కిట్టికి చెందిన కిట్టీస్ మజిల్ ప్లానెట్' ప్రారంభోత్సవానికి హీరో యష్ టాక్సిక్ సినిమా పనులు పక్కనపెట్టి మరీ వీలు చూససుకుని వచ్చాడు. యశ్‌తో పాటు స్యాండిల్ వుడ్ హీరోలు ప్రేమ్, అజయ్‌రావ్ కూడా అతిథులుగా వచ్చారు. ఈ సందర్భంలో కిట్టి క్రమశిక్షణ. ఫిట్‌నెస్‌ గురించి కేజీఎఫ్ హీరో యష్ వివరించారు. ఇదే సమయంలో టాక్సిక్ సినిమా గురించి యష్ సమాచారాన్ని కూడా పంచుకున్నారు. వీలైనంత త్వరగా టాక్సిక్ సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని హీరో యష్ చెప్పారు.

KGF hero Yash said that he will stay away from direct politics

ఈ సారి యష్ సినిమా ఇండస్ట్రీ గురించి ఓపెన్ గా మాట్లాడాడు. పాన్ ఇండియా సినిమా, దాని ఎఫెక్ట్స్ గురించి కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. అందుకే సినిమా ఇండస్ట్రీ కొత్త టాలెంట్స్‌ని ప్రోత్సహించాలని హీరో యష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సలార్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం, తరువాత కొన్ని సినిమాలు చేశారు. అయితే కేజీఎఫ్ సినిమాతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోయింది. బాహుబలి ప్రభాస్, జూనియర్ ఎన్ టీఆర్ తదితరులతో సినిమాలో చెయ్యడానికి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు అవకాశం వచ్చింది.

ఉగ్రం సినిమాకు దర్శకత్వం వహించిన ప్రశాంత్‌ నీల్‌ అదే ఉగ్రం సినిమా శాటిలైట్‌ రైట్స్‌ని అమ్ముకోవడానికి అనేక కష్టాలు పడ్డారని ఇదే సందర్బంలో హీరో యష్ చెప్పారు. అయితే ప్రశాంత్ నీల్ మీద నమ్మకంతో, ఆయన టాలెంట్ గుర్తించి మేము కేజీఎఫ్ సినిమాలు చేశామని, అదే కేజీఎఫ్ పార్ట్ 1, కేజీఎఫ్ పార్ట్ 2 సినిమాలో ఎంతటి విజయాని అందించాయో కొత్తగా తాను చెప్పనవసరం లేదని హీరో యష్ అన్నారు.

అనంతరం యష్ ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితులపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కన్నడ సినిమా కేవలం యష్ కు సంబంధించిన విషయం కాదని అన్నారు. కన్నడ సినిమాకు తాను ఏం చెయ్యాలో అది మాత్రమే చేస్తానని, నా పని ఏదో అనేది గుర్తించి ఆ విధంగా చేయగలనని, కన్నడ సినిమాకు నేను చేసిన సేవ ఏంటి అని ఆలోచిస్తే గతంలో తాను ఎలా ఉన్నానో, ఇప్పుడు ఎలా ఉన్నానో అందరికి తెలుసు అని హీరో యష్ అన్నారు.

KGF hero Yash said that he will stay away from direct politics

కన్నడ అభిమానులతో పాటు భారతీయులు తన మీద చూపించిన ప్రేమ, అభిమానానికి భవిష్యత్తులో తాను సినీ రంగానికి, అభిమానులకు ఏమి చేయగలను అనే విషయం ఆలోచించాలి దానికి అనుగుణంగా చేస్తానని హీరో యష్ అన్నారు. ఇప్పుడు కొత్త టాలెంట్స్ తో సినిమా రంగంలోకి వచ్చినవారిని ప్రోత్సహించాలని హీరో యష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రేమ్ ఓ సినిమా చేస్తున్నాడని, హీరో అజయ్ కూడా ఓ సినిమా చేస్తున్నాడని, వారి సినిమాలు హిట్ కావాలని తాను కోరుకుంటున్నానని హీరో యష్ చెప్పారు.

అందరి హీరోల సినిమాలు హిట్ అయితే సినిమా ఇండస్ట్రీ కూడా కలకలలాడుతుంటుందని, అందుకే నటీనటులు అందరికి సినీ పరిశ్రమ సపోర్ట్ చేయాలని, టీవీ ఛానెల్స్ శ్యాటిలైట్ హక్కులు తీసుకుని నిర్మాతలను ఆదుకోవాలని హీరో అయష్ అన్నారు. ఉగ్రం సినిమా శ్యాటిలైట్ హక్కులు విక్రయించడానికి మా దర్శకుడు ప్రశాంత్ నీల్ (సలార్ డైరెక్టర్) అనేక ఇబ్బందులు పడిన విషయం తాను జీవితంలో మరిచిపోలేనని హీరో యష్ అన్నారు. ఉగ్రం సినిమా కోసం ప్రశాంత్ నీల్ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, అయితే అదే ఉగ్రం శ్యాటిలైట్ హక్కులు ఏ టీవీ చానల్ తీసుకోలేదని, తరువాత ఆ సినిమా శ్యాటిలైట్ హక్కులను ఎవరో మధ్యవర్తి ద్వారా నష్టానికి అమ్మేశామని హీరో యష్ అన్నారు.

కేజీఎఫ్‌ వచ్చిన తరువాత డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ అందనంత ఎత్తుకు ఎదిగాడని, మేము అందరూ ఎంతో నమ్మి కేజీఎఫ్ సినిమా చేశామని, అతనిలో ప్రతిభ బయటకు వచ్చిందని అన్నారు నిర్మాతలు, దర్శకులకు కష్టాలు వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీని వీడలేదని హీరో యష్ చెప్పారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఏ పార్టీతో తాను దగ్గరగా లేనని, నా లక్ష్యం మరోకటి ఉందని, నా లక్షం పూర్తి అయ్యే వరకు తాను రాజకీయాల జోలికి వెళ్లనని కేజీఎఫ్ హీరో, రాఖీభాయ్ యష్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+