విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ లో 'అర్జున్ రెడ్డి' సినిమా ఎంత ప్రత్యేకమో మనందరికీ తెలిసిందే. విజయ్ కెరీర్ అర్జున్ రెడ్డికి ముందు.. తర్వాత అని చెప్పొచ్చు. ఈ మూవీ విజయ్ కు మాత్రమే కాదు దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు కూడా చాలా ప్రత్యేకం. ఈ మూవీ ఓవర్ నైట్ లో ఇద్దరు స్టార్స్ ను భారతీయ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది. అర్జున్ రెడ్డి మూవీకి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అంతేకాక చాలామంది సెలబ్రిటీస్ కు కూడా ఈ మూవీ చాలా ఫేవరెట్.
అర్జున్ రెడ్డి మూవీకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఆయనకు ఇదే తొలి సినిమా.. ఆ తర్వాత ఈ మూవీ హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కింది. హిందీలోనూ సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహించారు. తెలుగులో విజయ్ దేవరకొండ చేసిన క్యారెక్టర్ ను హిందీలో షాహిద్ కపూర్ పోషించారు. హీరోయిన్ గా కియారా అద్వాణి నటించారు. అయితే విజయ్ దేవరకొండపై కియారా అద్వాణి మనసుపారేసుకుందని టాక్. టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఈ సీక్రెట్ విషయాన్ని వెల్లడించారు. తనకు ఒకప్పుడు విజయ్ దేవరకొండపై క్రష్ ఉండేదని రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన ఓ షోలో బయటపెట్టింది కియారా అద్వాణి. దాంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి హోస్ట్ చేసిన ఓ చిట్ చాట్ కార్యక్రమంలో కియారా ఈ విషయాన్ని బయటపెట్టింది. విజయ్ దేవరకొండపై తనకు సాఫ్ట్ కార్నర్ ఉండేదని ఓపెన్ గా చెప్పింది. "నేను విజయ్ కు పెద్ద అభిమానిని. విజయ్ అంటే నాకు చాలా ఇష్టం" అని కియారా తన క్రష్ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాటలు విన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. అలాగే "గేమ్ ఛేంజర్" సినిమాలో రామ్ చరణ్‌తో కలిసి నటిస్తున్నప్పుడు కూడా కియారా అప్పుడప్పుడు విజయ్ గురించి అడిగేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కియారా అద్వాణి, విజయ్ దేవరకొండల గురించిన వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు కియారా అడ్వాణి ప్రస్తుతం యశ్ తో టాక్సిక్ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ మార్చి 19 నే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడింది. టాక్సిక్ మూవీ జూన్ 4 న విడుదల కానుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యశ్ తో పాటుగా నయనతార,హుమా ఖురేషి, రుక్మిణీ వసంత్, తారా సుతారియా తదితర స్టార్లు నటిస్తున్నారు.












Click it and Unblock the Notifications