ఈసారి తిరుపతి వెంకన్న స్వామి నీతోడే ఉన్నాడు సామి..!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'కింగ్‌డమ్' బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ స్పై-గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా జూలై 31న విడుదలై అంచనాలను మించి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మొదటి రోజు నుంచే అద్భుతమైన స్పందనను అందుకున్న ఈ చిత్రం, విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే ఓపెనింగ్ రోజు అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.
మొదటి రోజు రూ. 39 కోట్ల భారీ గ్రాస్ వసూళ్లను రాబట్టిన 'కింగ్‌డమ్', రెండు రోజుల్లోనే రూ. 53 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించిందని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. తాజాగా, మేకర్స్ ప్రకటించిన మూడు రోజుల కలెక్షన్ల ప్రకారం, 'కింగ్‌డమ్' ప్రపంచవ్యాప్తంగా రూ. 67 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు రూ. 53 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

విజయ్ దేవరకొండ మాస్ యాక్షన్ పర్‌ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. విజయ్, సత్యదేవ్ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ అందించిన బీజీఎం సినిమాకు హైలైట్‌గా నిలిచి, ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. భాగ్యశ్రీ బోర్సే ఈ చిత్రంలో విజయ్‌కు జోడీగా నటించింది. ఈ ఆదివారంతో పాటు రాబోయే వారంలో కూడా 'కింగ్డమ్' వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా విజయ్ కెరీర్‌కు మరో మైలురాయిగా నిలవనుంది.












Click it and Unblock the Notifications