వేణుస్వామి జాతకాల దొంగ.. నమ్మొద్దు: హీరోయిన్

వివాదాస్పద జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. రాజకీయ రంగంతోపాటు సినీ రంగంలోని సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత జాతకాలు బహిరంగంగా చెబుతూ చివరకు ఆయన కూడా ఒక సెలబ్రిటీ అయిపోయారు. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటారని ముందుగానే చెప్పడంతోపాటు అది జరగడంతో అతను ఏం చెబుతున్నాడా? అనే ఆసక్తి కూడా అందరిలో కలిగింది. అయితే వేణుస్వామి చెప్పినవి రెండు సంఘటనలు జరిగితే చెప్పినా జరగనవి మాత్రం 98 సంఘటనలున్నాయి.

తాజాగా వేణుస్వామిపై హీరోయిన్ కుషిత కల్లపు (బజ్జీల పాప) సంచలన వ్యాఖ్యలు చేసింది. కుషిత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. అర్జున్ కల్యాణ్ హీరోగా నటించిన బాబు నెంబర్ వన్ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కుషిత వేణుస్వామిపై విరుచుకుపడింది. అతను చెప్పేవన్నీ అబద్దాలేనని, తనకు ఫేమ్ రాకముందే ఇంకో సంవత్సరంలో నీకు ఫేమ్ వస్తుందని చెప్పానంటూ వేణు స్వామి చెప్పాడన్నారని కుషిత తెలిపింది. ఇదంతా పచ్చి అబద్దమని, తాను ఆయన్ను కలిసింది తనకు ఒక ఫేమ్ వచ్చిన తర్వాతేనని, అలాంటి ముందుగా ఆయన తన గురించి ఎలా చెబుతాడని, అది సరికాదని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

kushita kallapu comments on astroleger venuswamy

హీరోయిన్లకు పూజలు చేయించడంలో కూడ ఈ జ్యోతిష్యుడు సుప్రసిద్ధుడు. గతంలో రష్మికకు పూజలు చేయించారు. ఆ తర్వాత ఆమె నేషనల్ క్రష్ గా మారిపోయింది. తాను పూజలు చేయించిన తర్వాత రష్మిక జాతకం మారిపోయిందంటూ ప్రచారం చేసుకున్నారు. దీంతో పలువురు హీరోయిన్లు ఆయనచేత పూజలు చేయించుకునేందుకు ముందుకు వచ్చారు. నిధి అగర్వాల్, డింపుల్ హయతి, అషురెడ్డి లాంటివారు పూజలు చేయించుకున్నప్పటికీ వారి కెరీర్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. మళ్లీ తర్వాత ఏ హీరోకు, లేదంటే హీరోయిన్ కు సంబంధించిన వీడియోతో ముందుకు వస్తాడో చూడాలి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+