తల్లి కాబోతున్న లావణ్య త్రిపాఠి.. మెగా ఇంట సంబరాలు..?
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచియం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్.. తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో..మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి.
నవంబర్ 1న ఇటలీలో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠిల పెళ్లిని మెగా ఫ్యామిలీ ఇటలీలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. పెళ్లి తరువాత వరుణ్ తన సినిమాలతో బిజీగా మారాడు. వరుణ్ ప్రస్తుతం మట్కా అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి పెళ్లి తరువాత చాలా సెలక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె ఇటీవలే మిస్ పర్‌ఫెక్ట్ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిది.

ఆ తర్వాత మరో సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లావణ్య తన పర్సనల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ఇదిలా ఉంటే లావణ్య త్రిపాఠి తల్లి కాబోతుందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా ఫ్యామిలీలోకి మరో వారసుడు రాబోతున్నారంట. నాగబాబు కోడలు, హీరో వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీ తల్లికాబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు రెండు రోజుల క్రితం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
దీనికి సంబంధించిన వీడియోలు,ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోల్లో లావణ్య త్రిపాఠి కొంచెం బొద్దుగా కనిపించారు. పొట్ట కనిపించకుండా మొత్తం చీర చుట్టుకున్నారు. లావణ్య తీరును చూసిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అని అంతా ఫిక్స్ అవుతున్నారు. లావణ్య శారీతో కవర్ చేసుకున్నటువంటి ఈ పద్ధతి వల్ల త్వరలో మెగా ఫ్యామిలీకి వారసుడిని ఇవ్వబోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి తోడు లావణ్య త్రిపాఠి ఇటీవల పెద్దగా బయట కనిపించడం లేదు.సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా లేరు. దీంతో ఆమె గర్బవతి కావడం వల్లే బయటకు రావడం లేదని అభిమానులు అనుకుంటున్నారు. మరి ఈ విషయంపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications