బాలయ్యపై నటి లయ షాకింగ్ కామెంట్స్ వైరల్..!

చూడగానే పక్కింటి అమ్మాయిలా కనిపిస్తారు నటి లయ. తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్ల లిస్ట్ లో లయ అప్పట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండేవారు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయిన తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యామిలీ హీరోయిన్ గా టాలీవుడ్ లో చెరగని ముద్ర వేశారు. స్వయంవరం, దేవుళ్లు, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, శివ రామరాజు, మిస్సమ్మ, విజయేంద్ర వర్మ తదితర హిట్ చిత్రాల్లో మెరిశారు నటి లయ.

అయితే నటసింహం నందమూరి బాలకృష్ణ తో విజయేంద్ర వర్మ చిత్రంలో ఓ హీరోయిన్ గా నటి లయ నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో బాలయ్యతో జరిగిన అనుభవాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు లయ. బాలయ్య అంటే క్రమశిక్షణ.. క్రమశిక్షణ అంటే బాలయ్య అని అన్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అటు నందమూరి అభిమానులను, ఇటు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.


ఇటీవల ఓ ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ.. "బాలకృష్ణ గారు సెట్స్‌ లో ఉంటే ఆ ఎనర్జీనే వేరుగా ఉంటుంది. ఆయన చాలా క్రమశిక్షణతో ఉంటారు. తోటి నటీనటులతో ఎంతో సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తుంటారు. ఆయనతో కలిసి పని చేయడం నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. అవకాశం వస్తే ఆయనతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవాలని నాకు ఉంది" అని లయ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బాలయ్యపై ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Laya Emotional I Cried Because of Balakrishna on Vijayendra Varma Sets Heartwarming Memories

ఇక నటి లయ చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఆ తర్వాత తిరిగి ఇటీవల సినిమాలు చేస్తున్నారు. ఇటీవల నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో నటించారు లయ. మరికొన్ని సినిమాలూ చేస్తున్నట్లు సమాచారం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+