నిర్మాత అంటే ఆమే.. హీరోయిన్ కంటే ధీటుగా...!
వాస్తవానికి ప్రతి రంగంలో నెపోటిజం ఉంటుంది. చిత్ర పరిశ్రమలో అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. హీరోల కొడుకులు హీరోలుగా, డైరెక్టర్ కొడుకులు హీరోలుగా, హీరోయిన్ల కొడుకులు హీరోలుగా.. ఇలా వారసత్వాన్ని మోసుకొస్తూ తమ ఇంటిపేరుతో జీవితాన్ని లాగించేస్తుంటారు. అత్యంత అరుదైన సందర్భంలో మాత్రమే ఒక నిర్మాత కూతురు నిర్మాతగా మారింది. ఆమె ఎవరంటే.. సూర్యదేవర హారిక.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ అధినేత చినబాబు పెద్ద కుమార్తె హారిక. మ్యాడ్ సినిమాకు నిర్మాతగా ఆమె పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు నిర్మాతగా రాణించబోతోంది. వాస్తవానికి నిర్మాత అనగానే.. వయసు, అనుభవం, పెద్ద తరహాలో.. ఇలా అనుకుంటారు. కానీ హారిక మాత్రం చిన్నవయసులోనే నిర్మాతగా మారిపోయింది. తండ్రి చినబాబు, అన్న నాగవంశీ ఉన్నారనే ధైర్యంతో అడుగు ముందుకు వేసింది. అదే ధైర్యంతో సూపర్ హిట్ కొట్టింది.

ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. అయితే మ్యాడ్ సక్సెస్ మీట్ లో మొదటిసారిగా కెమెరా ముందు కనిపించింది. మైక్ పట్టుకొని మాట్లాడాలంటే ఎవరైనా తడబడతారు. హారిక కూడా అలాగే తడబడింది. అయితే అన్నయ్య నాగవంశీ పక్కనే ఉండి ధైర్యంగా మాట్లాడించాడు. మ్యాడ్ ను విశేషంగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలని, సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ అని చెప్పింది.
అలాగే తనకు మద్దతుగా నిలిచిన నాన్నకు, అన్నయ్యకు కూడా థ్యాంక్స్ అని చెప్పింది. హారిక కూడా సినీ రంగంలో హీరోయిన్లకు ధీటుగా ఉన్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. హారిక బ్యానర్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్ - మహేష్ బాబు కాంబినేషన్ లో రూపొందిస్తున్నారు.












Click it and Unblock the Notifications