మహేష్‌బాబు మూవీలో విలన్‌గా మలయాళ హీరో?
మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్ల్ తెరకెక్కనున్న ఎస్ఎస్ఎమ్‌బి29 చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజిగా ఉంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో విలన్‌గా చేయబోతున్నారని టాలీవుడ్‌వర్గాల్లో టాక్.
గ్లోబల్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ డ్రామాగా ఎస్ఎస్ఎమ్‌బి29 చిత్రం ఉండనుంది. మహేశ్ బాబు - రాజమౌళి చిత్రంలో విలన్‍గా మలయాళ స్టార్ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ నటించనున్నారనే విషయం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన సలార్‌లో పృథ్విరాజ్ ఓ ప్రధాన పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఆయన పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యారు. ఇక, ఇప్పుడు ఏకంగా రాజమౌళి సినిమాలోనే ఆఫర్ కొట్టేసాడని టీ టౌన్ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్. అయితే, ఈ విషయంపై రాజమౌళి - పృథ్విరాజ్ సుకుమారన్ మధ్య గత కొంతకాలంగా చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికి ఈ విషయంపై ఓ క్లారిటీ రావటంతో ఇద్దరూ అంగీకరించారని టాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే, ఈ విషయంపై అటు మూవీ మేకర్స్ నుంచి కానీ మలయాళ హీరో నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటనా రాలేదు.

విభిన్నమైన పాత్రలో..
ఎస్ఎస్ఎంబీ29 చిత్రాన్ని సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కించాలని రాజమౌళి భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ ప్రొడక్షన్ హౌస్‍లతో కూడా ఆయన ఈ విషయంపై చర్చిస్తున్నారట. ఇక, ఈ సినిమాలో మహేశ్ బాబు సరికొత్త లుక్‍లో కనిపిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో పృథ్విరాజ్ సుకుమారన్ పాత్ర విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇక, పృథ్వీరాజ్ సుకుమారన్ డిమాండ్ ఇటీవల బాగా పెరిగింది. పృథ్వి కేవలం మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తూ ఫుల్ బిజిగా ఉన్నాడు.












Click it and Unblock the Notifications