18 ఏళ్ల తరువాత కలిసి వస్తున్న "లెజెండ్స్".. కలెక్షన్ల ఊచకోతే !!

మలయాళ సినీ పరిశ్రమలో లెజెండ్స్‌గా గుర్తింపు పొందిన మమ్ముట్టి, మోహన్ లాల్ దాదాపు 18 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో సినీ ప్రియుల్లో భారీ ఉత్సాహం నెలకొంది. ఈ ఇద్దరు దిగ్గజాలు కలిసి నటించిన తాజా చిత్రం Patriot మే 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రీయూనియన్‌ను మాలీవుడ్‌లో ఒక ప్రత్యేక ఈవెంట్‌గా భావిస్తున్నారు. ముఖ్యంగా వారి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, నటనలోని పోటీ ఈ చిత్రంలో కూడా హైలైట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి.

లెజెండరీ కాంబినేషన్ రీటర్న్..

గతంలో Twenty:20 వంటి భారీ మల్టీస్టారర్‌లో కలిసి నటించిన ఈ ఇద్దరు సూపర్‌స్టార్స్, మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు పండుగలా మారింది. ఈ చిత్రానికి హై ప్రొడక్షన్ వాల్యూస్, ఇంటర్నేషనల్ లెవల్ యాక్షన్ సీక్వెన్సులు ప్రధాన బలం కానున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ కూడా హాలీవుడ్ స్టైల్‌లో ఉండబోతున్నాయని సమాచారం. యుద్ధ సన్నివేశాలు, రియలిస్టిక్ యాక్షన్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చెప్పుకుంటున్నారు.

mammootty-and-mohanlal-starring-patriot-movie-releasing-on-may-1st-and-advance-bookings-create-recor

దర్శకుడు Mahesh Narayanan రూపొందించిన ఈ చిత్రంలో మమ్ముట్టి 'డాక్టర్ డేనియల్ జేమ్స్' పాత్రలో కనిపిస్తుండగా, మోహన్‌లాల్ 'కల్నల్ రహీమ్ నాయక్' పాత్రలో నటిస్తున్నారు. దేశభక్తి, ఇంటెలిజెన్స్, యాక్షన్, ఎమోషన్‌ల మేళవింపుతో కథ సాగుతుందని తెలుస్తోంది. ఇద్దరు హీరోల మధ్య ఐడియాలజీ క్లాష్, సిస్టమ్‌పై పోరాటం వంటి అంశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.

అలానే ఈ చిత్రంలో Fahadh Faasil, Nayanthara వంటి స్టార్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. వీరి ప్రెజెన్స్‌తో సినిమాకు మరింత వెయిట్ పెరిగింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నందున తెలుగు, తమిళ, హిందీ మార్కెట్లలో కూడా మంచి బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇంత భారీ సినిమా అయినప్పటికీ ప్రమోషన్లలో కొంత లోటు కనిపించడం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి ప్రెస్ మీట్, ఈవెంట్ నిర్వహించకపోవడం చర్చనీయాంశమైంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డ్..

అయితే ప్రమోషన్లు తక్కువైనా, మాలీవుడ్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ రెస్పాన్స్ అందుకుంటోంది. ఇప్పటికే ₹13 కోట్లకు పైగా బుకింగ్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓపెనింగ్స్ పరంగా రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక తెలుగు వెర్షన్ విడుదలపై మాత్రం క్లారిటీ లేకపోవడం అభిమానుల్లో సందేహాలు రేకెత్తిస్తోంది. మే 1న అన్ని భాషల్లో రిలీజ్ అవుతుందా? లేక ఆలస్యమవుతుందా? అన్నది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో తెలుగు ప్రేక్షకులు ఎదురుచూపుల్లో ఉన్నారు.

ప్రస్తుతం మాలీవుడ్‌లో Luca Chapter 1 (₹304 కోట్లు) అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే 2018 వంటి సినిమాలు కూడా భారీ వసూళ్లు సాధించాయి. ఈ నేపథ్యంలో 'పేట్రియాట్' అడ్వాన్స్ ట్రెండ్, హైప్‌ను చూస్తే ఈ రికార్డులను బ్రేక్ చేసే అవకాశముందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+