మంచు ఫ్యామిలీకి బిగ్ షాక్ ..మంచు లక్ష్మీ అరెస్ట్ తప్పదా..?
సినీ సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బెట్టింగ్ యాప్స్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై తెలంగాణ పోలీసులు నజర్ పెట్టారు. బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొనే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. దీనిలో భాగంగానే పోలీసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.తాజాగా 11 మంది సెలబ్రిటీలకు పోలీసులు షాకిచ్చారు.హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.

తాజాగా ఈ లిస్ట్‌లో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆమె ఓ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తోన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో మంచు లక్ష్మీ మాట్లాడుతూ..ఇది ఒక మంచి ప్లాట్ఫారం డబ్బు సంపాదించుకోవడానికి అందరికీ చక్కగా ఉపయోగపడుతుంది అంటూ యోలో 247 అనే బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తున్న సినీ సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే.దీంతో ఇప్పుడు మంచు లక్ష్మీ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసిన వీడియో బయటకు రావడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications