మహేష్‌పై మీ ప్రేమ ఇలాగే కొనసాగాలి... నమ్రత ఎమోషనల్ పోస్ట్...
మహేష్.. మహేష్.. ఆ పేరులోనే ఓ వైబ్రేషన్ ఉంది.. ఆ పేరులో ఓ మత్తు ఉంది అని అష్టాచమ్మా సినిమాలో హీరోయిన్ స్వాతి అన్నట్లుగా నిజంగానే ఆ పేరులో ఏదో మ్యాజిక్ ఉంటుంది. అందుకే మహేష్‌బాబుకు చాలామంది లేడి ఫ్యాన్స్ ఉంటారు. స్క్రీన్‌పై మహేష్‌బాబు స్మైల్ చూసేందుకు ఎంతోమంది మహిళలు పరితపిస్తుంటారు. ఇప్పటికి తరగని అందం, నటనతో అభిమానుల మనసులను దోచుకుంటున్నాడు సూపర్‌స్టార్ మహేష్‌బాబు. మహేష్‌బాబు భార్య నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు నమ్రత. నిత్యం పిల్లల గురించి మహేష్‌బాబు గురించి సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఇప్పడు తాజాగా నమ్రత మహేష్‌బాబు అభిమానుల గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
మహేష్‌బాబు ఫ్యాన్స్‌కు నమ్రత హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులున్నారు. మహేష్ ప్రతి ప్రయత్నంలో ఆయనకు అండగా ఉంటున్నారు. గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహేష్ అభిమానులు చూపించిన ప్రేమను చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. మహేశ్.. అభిమానులకు మీరొక ఎమోషన్. మీ ప్రేమ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నా అంటూ నమ్రత సోషల్‌మీడియాలోని తన ఖాతాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు.

గుంటూరు కారం ప్రీ రీలిజ్ ఈవెంట్‌లో ఎమోషనల్ అయిన మహేష్‌బాబు : మహేష్‌బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాపై అభిమానులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12, 2024న థియేటర్లలోకి తీసుకురానున్నారు. నిన్న గుంటూరులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా మహేష్‌బాబు ఫ్యాన్స్‌నుద్దేశించి చాలా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. మహేష్ మాటల్లో.. మీరెప్పుడూ నాగుండెల్లో ఉంటారు. సంక్రాంతి నాన్నగారికి, నాకు బాగా కలిసొచ్చిన పండగ. ఈ పండుగ సీజన్‌లో మా సినిమా రీలిజయితే అది హిట్టే. ఈసారి కూడా అదే జరుగుతుందని అనుకుంటున్నా. కానీ, ఇప్పడు నాన్న మనతో లేరు. ఇకనుంచి మీరే నాకు అమ్మ, నానన్న అంటూ ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడారు. మహేష్ ప్రీ రీలిజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఈ వీడియోను నమ్రత సోషల్‌మీడియాలోని తన ఖాతాలో పోస్ట్ చేసింది.












Click it and Unblock the Notifications