వీధుల్లో వడాపావ్ అమ్మాడు..రోడ్లపై పడుకున్నాడు.. 'ఛావా' డైరెక్టర్ కష్టాలకు కన్నీళ్లు ఆగవు..!
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందాన ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఛావా'. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో ఈ మూవీ దూసుకెళ్తోంది. ఇప్పటికే ఈ చిత్రం దాదాపు రూ. 550కోట్లకుపైగా వసూల్లు సాధించింది. అటు ప్రేక్షకుల డిమాండ్ మేరకు ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ పతాకంపై మార్చి 7 నుంచి 'ఛావా' తెలుగు వెర్షన్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. మరి ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ గురించి నమ్మలేని నిజాలు మీకు తెలుసా..? ఆయన లైఫ్ జర్నీ వింటే సినిమా కష్టాలు అంటాం.

ఈ డైరెక్టర్ బాలీవుడ్ స్టార్స్ అయిన షారుఖ్ ఖాన్, అలియా భట్ లతో కలిసి పనిచేశారు. కానీ తన పనిలో మాత్రం ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఆయనెవరో కాదు ఛావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్. ఇప్పుడు ఛావా సినిమాతో బాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ డైరెక్టర్ గా అవతరించారు. లక్ష్మణ్ ఉటేకర్ మొదటి సినిమా కార్తిక్ ఆర్యన్, క్రితిసనన్ కాంబోలో వచ్చిన కామెడీ మూవీ లూకా చుప్పి. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మిమి సినిమా తెరకెక్కించారు. ఈ మూవీ ఓటీటీలో రిలీజైనా పాజిటివ్ టాక్ సంపాదించింది. ఇక 2023లో విక్కీ కౌశల్, సారా అలీ ఖాన్ కాంబోలో వచ్చిన జరా హట్కే జరా బచ్కే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీకూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది.

డైరెక్టర్ అవ్వక ముందు..
లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్టర్ అవ్వక ముందు పలు బాలీవుడ్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. కన్నా అయ్యర్, బ్లూ, ఇంగ్లీష్ వింగ్లీష్ , డియర్ జిందగీ, హిందీ మీడియం, 102 నాట్ అవుట్ లాంటి చిత్రాలకు పనిచేశారు. ఆ తర్వాత మరాఠీ భాషలో తపాల్(2014), లాల్ బాగ్చీ రాణి(2016) చిత్రాలకు డైరెక్షన్ చేశారు. అయితే లక్ష్మణ్ ఉటేకర్ జర్నీలో చాలా కష్టాలను అనుభవించాడట. సినిమాటోగ్రాఫర్ అవ్వక ముందు ముంబై రోడ్లపై వడాపావ్ అమ్మేవాడట. రోడ్లపై, స్టూడియా కారిడార్లలోనూ నిద్రించేవాడట.
ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం అధారంగా ఛావా రూపొందింది. శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్, ఆయన భార్య యేసుబాయి పాత్రలో రష్మిక కనిపించారు. శంభాజీ కథలో కీలకమైన ఔరంగజేబు పాత్రను అక్షయ్ ఖన్నా చేశారు. ఫిబ్రవరి 14న సినిమా ప్రేక్షకుల ముందుకువచ్చి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ మూవీ రూ.550 కోట్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
-
హన్సిక భర్తకి అంతకు ముందే పెళ్లి జరిగిందని తెలుసా.. బెస్ట్ ఫ్రెండ్ తోనే !! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు












Click it and Unblock the Notifications