ఆ మెగా హీరోను పట్టించుకోని జనసేన..ఒక్క దెబ్బకు లెక్కలు మారిపోయాయిగా..!
మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ డేంజర్‌లో ఉందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. కెరీర్ స్టార్టింగ్‌లో వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ తేజ్. ఇదే సమయంలో మెగా ట్యాగ్‌కు సైతం ఆయన దూరంగా ఉన్నట్టు కనిపించారు. కథబలం ఉన్న సినిమాలు చేస్తూ యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు.
ముకుందా సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయిన వరుణ్ తేజ్, ఫిదా సినిమాతో బ్లాక్ బ్లాస్టర్ హిట్ కొట్టాడు. కంచె, తొలిప్రేమ, f2,f3, గద్దలకొండ గణేష్, అంతరిక్షం వంటి వరుస హిట్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే గత కొంతకాలంగా వరుణ్ తేజ్ కెరీర్ గాడి తప్పింది. వరుణ్ తేజ్ నుంచి నుంచి సరైన సినిమాలు రావడం లేదు.వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. గని, గాండీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ వంటి సినిమాల ప్లాప్‌లతో వరుణ్ తేజ్ కెరీర్‌కు బాగా డ్యామేజ్ జరిగింది.

తాజాగా వచ్చిన 'మట్కా'గురించి ఎంత చెప్పుకుంటే అంత మంచిది. మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమాపై వరణ్ తేజ్ భారీ ఆశలనే పెట్టుకున్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఎంతలా అంటే మెగా అభిమానులే సినిమాకు దూరంగా ఉన్నారంటే 'మట్కా' ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకు దారుణంగా రూ.64 లక్షల రూపాయిలు మాత్రమే వసూలు చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి.
కనీసం మెగాభిమానులు, జనసైనికులు ఈ సినిమాను చూసినా ఇంత తక్కువ వసూళ్లు వచ్చి ఉండేవి కాదనేది ట్రేడ్ అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో పవన్, చిరు అభిమానులున్నారు. వాళ్లు కూడా ఈ సినిమా వైపు కన్నెత్తి చూడలేదనే విషయం తెలుస్తూనే ఉంది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే మట్కా సినిమా అత్యంత భారీ డిజాస్టర్‌గా సినీ పండితులు తేల్చేస్తున్నారు. వరుస ప్లాప్‌లతో ఈ మెగా హీరో డబుల్ హ్యాట్రిక్ ప్లాప్‌లకు బాటలు వేసినట్టు అయింది.












Click it and Unblock the Notifications