పేరు మార్చుకున్న మెగాహీరో.. నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి: అన్నీ సంచలనాలే!!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన తన పేరును మార్చుకున్నారు. తనకు కొత్త పేరు పెట్టుకున్న సాయిధరమ్ తేజ్ తన తల్లి ఎప్పుడు తనతో పాటు ఉండాలని, తన పేరులో తన తల్లి పేరును చేర్చుకున్నారు. మార్చి 8న తన తల్లి దుర్గ పేరును తీసుకొని సాయి దుర్గ తేజ్ గా సరికొత్తగా నామకరణం చేసుకున్నారు.

అలాగే తన తల్లి పేరు మీద ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించానని ఆయన వెల్లడించారు. దుర్గ ప్రొడక్షన్ బ్యానర్ మీద భవిష్యత్తులో పని చేయబోతున్నట్లు సాయి దుర్గా తేజ్ వెల్లడించారు. సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సత్య షార్ట్ ఫిలిం స్పెషల్ షో ను హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్ లో మీడియాకు ప్రదర్శించారు.

mega hero sai dharam tej changed his name and said his next target is chiranjeevi

నవీన్ విజయ్ కృష్ణ దర్శకత్వలో రూపొందిన ఈ షార్ట్ ఫిలిం తన తల్లి పేరు మీద ప్రారంభించిన దుర్గా ప్రొడక్షన్ బ్యానర్ మీదనే తెరకెక్కిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన ఆయన మీడియా అడిగిన అనేక ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చేసే అవకాశం ఉందా అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మెగా హీరో మొన్ననే పవన్ కళ్యాణ్ తో సినిమా చేశాను. అంతకుముందు నాగబాబు గారితో సినిమా చేశాను. ఇక నా నెక్స్ట్ టార్గెట్ చిరంజీవి గారే అంటూ పేర్కొన్నారు. ముందు మా చిరుమామతో సినిమా చేసిన తర్వాత తర్వాత మిగతా వాళ్లతో మల్టీస్టారర్ చేస్తా అన్నారు మెగామేనల్లుడు సాయి దుర్గ తేజ్.

ఇక అంతే కాదు గాంజా శంకర్ సినిమా గురించి అడిగిన ప్రశ్నకు ఆయన వ్యంగంగా స్పందించారు. గాంజా శంకర్ సినిమా ఉందా? ఆగిపోయిందా? అని అడిగిన ప్రశ్నకు, ఓ వెబ్సైట్లో ఆగిపోయింది అన్ని వార్త చూసిన తర్వాతే నాక్కూడా తెలిసిందని , ఇక సినిమా ఉందా లేదా అనేది ఆ వెబ్సైట్ వాళ్ళు చెప్తే కానీ తెలీదని సాయి దుర్గా తేజ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తంగా మెగా హీరో చెప్పిన సంచలన విషయాలు మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+