మెగా ఇంటి కోడలుగా శ్రీలీల..సైలెంట్‌గా గిఫ్ట్ పంపించిన మెగా హీరో..?
తెలుగులో స్టార్ హీరోయిన్ ఎవరంటే అందరు ఠక్కున శ్రీలీల పేరునే చెబుతారు. గత సంవత్సర కాలంలో ఆమె నటించిన సినిమాలే దీనికి కారణం. గతేడాది ఆమె నటించిన సినిమాలు గ్యాప్ లేకుండా బాక్సాఫీస్‌పై దాడి చేశాయి. సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పెళ్లి సందd సినిమాతో శ్రీలీల హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాలో హీరోగా పరిచియం అయ్యాడు.
పెళ్లి సందd సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తరువాత శ్రీలీల హీరో రవితేజతో జోడీగా ధమాకా సినిమాలో నటించింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో శ్రీలీలకు వరుస ఆఫర్లు వెలువెత్తాయి. ఈ క్రమంలోనే స్కంద, భగవంత్ కేసరి,గుంటూరు కారం, ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో శ్రీలీల నటించింది. పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' , విజయ్ దేవరకొండ కొత్త సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల..తెలుగులో బిజీ హీరోయిన్‌గా మారింది. ఇదే సమయంలో తమిళంలో కూడా తన సత్తా చాటుతోంది ఈ అమ్మడు.

అయితే గత కొంతకాలంగా శ్రీలీల హవా తగ్గిందనే చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ కావడంతో తెలుగులో శ్రీలలకు ఆఫర్లు తగ్గాయి. ఇదిలా ఉంటే తాజాగా శ్రీలీలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. శ్రీలీలకు మెగా హీరో దీపావళి గిఫ్ట్ పంపించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆ హీరో మరెవ్వరో కాదు పంజా వైష్ణవ్ తేజ్.'ఉప్పెన' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్, తాను నటించిన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. తాజాగా వైష్ణవ్ తేజ్ శ్రీలీలకు దీపావళి గిఫ్ట్ పంపించారంటూ ప్రచారం జరుగుతోంది. వైష్ణవ్ తేజ్, శ్రీలీల కలిసి 'ఆదికేశవ' సినిమాలో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. సినిమా ఫెయిల్ అయినప్పటికీ వీళ్ళ కెమిస్ట్రీకి మాత్రం బాగానే మార్కులు పడ్డాయి. ఆ పరిచియంతోనే వైష్ణవ్ తేజ్ శ్రీలీలకు దీపావళి గిఫ్ట్ పంపించి ఉంటారని భావిస్తున్నారు. ఇది కేవలం ఫ్రెండ్షిప్ కారణంగానే పంపించాడా..? లేక దాని వెనుక ఏమైనా అర్థాలు ఉన్నాయా ..? అంటూ కొందరు ఆరా తీయడం మొదలుపెట్టారు.
మరికొందరేమో ప్రేమలో ఉన్న విషయాన్ని ఇలా కన్ఫామ్ చేసేశావా బ్రో అంటూ వైష్ణవ్ తేజ్‌ను ప్రశ్నిస్తున్నారు. శ్రీలీల గతంలో ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ తాను ఒకరితో ప్రేమలో ఉన్నానని స్పష్టం చేసింది. అతను వైష్ణవ్ తేజ్ అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఒకవేళ ఇదే నిజం అయితే శ్రీలీల మెగా ఇంటి కోడలుగా వెళ్లడం ఖాయమని వారు భావిస్తున్నారు. అయితే ఈ రూమర్లపై వీరిద్దరు స్పందించకపోవడంతో.. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications