"ఆపథ్బాంధవుడివయ్యా".. రూ.20 లక్షలు ఆర్ధిక సాయం చేసిన మెగాస్టార్ !!
సినీ పరిశ్రమ లోని ప్రతి ఒక్కరికీ పెద్దదిక్కు అంటే గుర్తొచ్చేది మెగాస్టార్ చిరంజీవి అనడంలో అతిశయోక్తి కాదు. టాలీవుడ్ లో పెద్ద నటీనటుల నుంచి చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వరకు ఎందరికో మెగాస్టార్ సాయం చేశారు. కరోనా సమయంలో చిరు చేసిన సాయం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కరోనా క్రైసిస్ ఛారిటీ అనే ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలకు నిత్యావసరాలు హెల్త్ కిట్స్ వ్యాక్సిన్స్ పంపిణీ చేశారు. ఇవే కాకుండా సినీ జర్నలిస్టులకు ఎన్నో విధాలుగా సాయపడ్డారు. చిరు బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదానం చేస్తూ ఎన్నో కోట్ల మంది ప్రాణాలను కాపాడుతోన్నారు. సాయం బయటకు చెప్పకుండా మరెంతో మందికి అండగా నిలుస్తూ తమ గొప్ప మనసు చాటుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.
అలానే తనతో కలిసి పనిచేసిన సినీ కార్మికులు, తనను నమ్ముకున్నవారి పట్ల చిరంజీవికి అపారమైన ప్రేమ, ఆప్యాయత చూపిస్తూ ఉంటారు అనడంలో సందేహం అక్కర్లేదు. వారి కష్టాల్లో ఎల్లప్పుడూ అండగా నిలిచే ఆయన మరోసారి కూడా అండగా నిలిచారు. కేవలం వారం వ్యవధిలోనే చిరంజీవి రెండు కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం అందించారు. సుమారు ₹20 లక్షల మొత్తాన్ని అందజేయడం ద్వారా, ఆ కుటుంబాలను కష్టకాలం నుంచి గట్టెక్కించారు. దీంతో మరోసారి ఆయనను నిజంగానే ఆపథ్బాంధవుడివయ్యా అంటూ కొనియాడుతున్నారు.

కాగా సినీ పరిశ్రమలో సుదీర్ఘకాలంగా మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న శివనాథ్ అనారోగ్యంతో చికిత్సకు అవస్థ పడుతున్నారని తెలియగానే, చిరంజీవి వెంటనే స్పందించారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం ₹10.5 లక్షలు అందించడంతో పాటు, శివనాథ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. అదేవిధంగా తన మాజీ మేనేజర్ నరసయ్య భార్యకు అత్యవసరమైన బైపాస్ సర్జరీ ఉందని తెలుసుకున్న చిరంజీవి వెంటనే చర్యలు తీసుకున్నారు. శస్త్రచికిత్స ఖర్చుల కోసం ₹9.5 లక్షల సహాయాన్ని అందించడమే కాకుండా, సర్జరీ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు.
మరోవైపు చిరంజీవి "మన శంకర వరప్రసాద్ గారు" సినిమా సంక్రాంతి కానుకగా విడుదలైన బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకొని.. గ్రాండ్ హిట్ కొట్టింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను సమానంగా ఆకట్టుకుని, చిరంజీవి కెరీర్‌లోనే తొలిసారి రూ.300 కోట్ల క్లబ్‌లో చోటు దక్కించుకుంది. ఈ భారీ విజయంతో చిరంజీవి తదుపరి ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయన తన 158వ చిత్రంపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే బాబీ కొల్లి దర్శకత్వంలో ఈ సినిమా అనౌన్స్ కాగా, వీరి కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య బ్లాక్‌బస్టర్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఏర్పడింది. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రక్తంతో తడిసిన గొడ్డలి, తీవ్ర యాక్షన్ బ్యాక్‌డ్రాప్ కనిపించడం ద్వారా ఇది పూర్తి స్థాయి మాస్ యాక్షన్ డ్రామా అని క్లారిటీ వచ్చింది.












Click it and Unblock the Notifications