Chiranjeevi: గ్రామీ అవార్డు గెలుచుకున్న శక్తి బ్యాండ్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందన!!

మ్యూజిక్ అవార్డులలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇచ్చే పురస్కారం గ్రామీ అవార్డును భారత్ కు చెందిన శక్తి బ్యాండ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ అవార్డుల ప్రధానోత్సవం అత్యంత ఘనంగా అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వేదికగా నిర్వహించారు. గ్రామీ అవార్డుల ప్రధానోత్సవంలో ప్రపంచ దేశాలకు చెందిన సంగీత కళాకారులు పాల్గొన్నారు. ఈ అవార్డు వేడుకలో భారత్ కు చెందిన సంగీత దిగ్గజాలు తళుక్కున మెరిశారు.

ఇక గ్రామీ అవార్డుల వేడుక ఆద్యంతం అద్భుతమైన పాటలతో, అందరిని ఆకట్టుకుంటూ కొనసాగింది . భారతీయ సంగీత దిగ్గజాలైన ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ ల ఫ్యూజన్ బ్యాండ్ 'శక్తి'కి బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు దక్కటంపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Megastar Chiranjeevi response on grammy awards 2024 winner Shakti band

గ్రామీ అవార్డులలో భారతదేశ జెండా సగర్వంగా ఎగిరింది. 'గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్' గెలుచుకున్న అద్భుతమైన టీమ్ శక్తికి హృదయపూర్వక అభినందనలు అంటూ చిరంజీవి పేర్కొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రామీ అవార్డును అందుకున్నతబ్లా కళాకారుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్, శంకర్ మహదేవన్ ​(సింగర్​), వి సెల్వగనేశ్ ​(percussionist​), గనేశ్​ రాజాగోపాలన్ ​(violinist​) మీరంతా మేము గర్వపడేలా చేశారని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు.

మీ విజయం కోట్లాది భారతీయులకు స్ఫూర్తి అని చిరంజీవి కొనియాడారు. శంకర్ మహదేవన్ తో తనకు పరిచయం ఉండటం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తాను నటించిన ఎన్నో చిత్రాలకు ఆయన అద్భుతమైన పాటలు పాడాడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రపంచ ప్రఖ్యాత గ్రామీ 2024 మ్యూజిక్ అవార్డ్స్ లో భారతదేశానికి అవార్డులు దక్కటం పట్ల చాలామంది ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ సంగీత వేదికపై భారతీయ సంగీత విద్వాంసులు తమ సత్తా చాటారు. శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్, ఫ్లూట్ ప్లేయర్ రాకేష్ చౌరాసియా, సెల్వ గణేష్, గణేష్ రాజగోపాలన్ తో పాటు మొత్తం ఎనిమిది మంది శక్తి బ్యాండ్ ద్వారా దిస్ మూమెంట్ ఆల్బమ్ కు గ్రామీ దక్కించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+