మౌళి 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక నవ్వుల పండగే..!!
టాలెంట్ ఉన్నోడిని ఎవరూ ఆపలేరు అన్న నానుడికి సరిగ్గా సెట్ అవుతాడు మౌళి తనూజ్. యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించి లక్షలాది మంది ప్రేమ అభిమానాన్ని చాటుకున్నాడు. ఆ తర్వాత 90 ఎస్ వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అనంతరం 'లిటిల్ హార్ట్స్' సినిమాతో హీరోగా తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మౌళి. ఈ మూవీకి సాయి మార్తాండ్ దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించింది లిటిల్ హార్ట్స్ మూవీ. ఈ మూవీలో మౌళి తనూజ్, శివానీ నాగరం హీరో హీరోయిన్లుగా నటించి మెప్పించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీ ఆ తర్వాత ఓటీటీలోనూ విజయవంతంగా రాణించింది. ఈ మూవీతో మౌళికి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వరుసగా అతనికి అవకాశాలు వచ్చాయి.
He’s back to steal your laughs, this time with his absolutely mad family 🤟#DongaNaaKoduku looting the Box Office worldwide from NOVEMBER 13th 🔥ROBBERY • CRIME • COMEDY#MouliRobsMythri #DNK #ShreyasMedia #ShreyasGroupa https://t.co/DRbiH82KUw
— Shreyas Media (@shreyasgroup) October 6, 2026
ఈ మేరకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ మౌళితో 'దొంగ నా కొడుకు' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఓ కీలక పోస్టర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ చూస్తే మౌళి తండ్రి పాత్రలో అలీ నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. పోస్టర్ లో హీరో చెవి పట్టుకుని తల్లి నిలదీస్తుండగా పక్కన ఉన్న తండ్రి ఏదో ఆందోళనతో ఉన్నట్లు కనిపిస్తుంది. పోస్టర్ ప్రకారం నిజంగానే కొడుకు చదువు మానేసి దొంగతనాలు చేస్తున్న క్రమంలో తల్లిదండ్రుల కోణంలోనే ఈ మూవీకి 'దొంగ నా కొడుకు' అనే టైటిల్ ను పెట్టినట్లు స్పష్టమవుతోంది.

ఇక ఈ మూవీతో శ్రీను కంబాల అనే దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. ఇక రెండో సినిమానే మౌళి మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థలో పని చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. ఈ మూవీ ఓ క్రైమ్ కామెడీ డ్రామా అని స్పష్టం అవుతోంది. మూవీలో ఒక జ్యువెలరీ షాప్ లో జరిగే దొంగతనం, ఆ తర్వాత జరిగే గందరగోళ పరిస్థితులే ప్రధాన కథాంశంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నవంబర్ 13 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో మౌళి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.












Click it and Unblock the Notifications
