మూవీ లవర్స్‌కి బిగ్ షాక్.. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు క్లోజ్ !
తెలుగు రాష్ట్రాల్లో సినిమా లవర్స్ కి బిగ్ షాక్ తగలనుంది. ఏపీ, తెలంగాణలో జూన్ 1వ తేదీ నుంచి థియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు. అద్దె ప్రాతిపదికన మూవీలు ప్రదర్శించలేకపోవడంతోనే తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్వహించిన సమావేశంలో.. నిర్మాతలు దిల్‌రాజు, సురేష్ బాబుతో పాటు 60 మంది ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. ఆ సమీక్షలో పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే మూవీలు ప్రదర్శిస్తామని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పినట్టు సమాచారం. అందుకే ఈ డిసిషన్ తీసుకున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.
గత కొంతకాలంగా సినీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య పర్సంటేజీ వ్యవహారంపై చర్చలు నడుస్తున్నాయి. అద్దెల రూపంలో మూవీలను ప్రదర్శించడం సాధ్యం కావడం లేదని ఎగ్జిబిటర్లు అంటుంటే.. పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు వాదనలు వినిపిస్తున్నారు. ఇరువురి వైఖరి కారణంగా నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకోసమే సంయుక్తంగా భేటీ ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించినప్పటికీ.. సఫలం కాలేదని అంటున్నారు.

ప్రధానంగా పర్సెంటేజీ విధానంపై వాడివేడిగా చర్చ జరగగా.. మల్టీప్లెక్స్‌ల్లో పర్సెంటేజీల ప్రకారం ప్రదర్శనలు జరుగుతుండగా, తాము మాత్రం అద్దె ప్రాతిపదికన ఎందుకు సినిమాల్ని ప్రదర్శించాలని పలువురు యజమానులు తమ వాపోయారు. తమ డిమాండ్ లపై వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ నిర్మాతలకి లేఖ రాయాలని వాణిజ్య మండలిని ఎగ్జిబిటర్లు కోరారు. అయితే పర్సెంటేజీ విధానంతో తాము నష్టపోవాల్సి వస్తుందని పలువురు నిర్మాతలు, పంపిణీదారులు అంటున్నారు.
మరోవైపు గతంలో పర్సంటేజ్ విధానాన్ని మూడు భాగాలుగా విభజిస్తూ తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారు. పెద్ద, మీడియం సినిమాలకు 2 శాతం నేగోషియేషన్‌తో.. ఉండేలా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ లకు పర్సంటేజ్ ప్లాన్ చేశారు. అవి ఎలానే తెలుసుకుందాం..
1. రూ. 30 కోట్లు పైగా నైజాం హక్కులు ఉన్న సినిమాలు..
వారం 1: డిస్ట్రిబ్యూటర్ 75%, ఎగ్జిబిటర్ 25%
వారం 2: డిస్ట్రిబ్యూటర్ 55%, ఎగ్జిబిటర్ 45%
వారం 3: డిస్ట్రిబ్యూటర్ 40%, ఎగ్జిబిటర్ 60%
వారం 4: డిస్ట్రిబ్యూటర్ 30%, ఎగ్జిబిటర్ 70%
2. రూ. 10-30 కోట్లు మధ్య నైజాం హక్కులు ఉన్న సినిమాలు
వారం 1: డిస్ట్రిబ్యూటర్ 60%, ఎగ్జిబిటర్ 40%
వారం 2: డిస్ట్రిబ్యూటర్ 50%, ఎగ్జిబిటర్ 50%
వారం 3: డిస్ట్రిబ్యూటర్ 40%, ఎగ్జిబిటర్ 60%
వారం 4: డిస్ట్రిబ్యూటర్ 30%, ఎగ్జిబిటర్ 70%
3. రూ. 10 కోట్ల లోపు సినిమాలు
వారం 1: డిస్ట్రిబ్యూటర్ 50%, ఎగ్జిబిటర్ 50%
వారం 2: డిస్ట్రిబ్యూటర్ 40%, ఎగ్జిబిటర్ 60%
వారం 3: డిస్ట్రిబ్యూటర్ 30%, ఎగ్జిబిటర్ 70%
జూన్‌లో పలు ప్రముఖ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా.. థియేటర్ల బంద్ నిర్ణయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒక నిర్ణయానికి వచ్చి త్వరగా ఈ విషయంలో పరిష్కారం వెతుక్కోకపోతే వారే నష్టపోయే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications