మైసా.. నా సామిరంగా: ఎప్పుడూ చేయని క్యారెక్టర్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్
మచ్ అవైటెడ్ ఫిల్మ్.. మైసా. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. నూతనంగా మెగా ఫోన్ పట్టిన రవీంద్ర పుల్లె ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. రాహుల్ రవీంద్రన్, ఈశ్వరి రావు కీలక పాత్రలు పోషిస్తోన్నారు. ఈ పాన్ ఇండియా మూవీని అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్ కింద అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యాపురెడ్డి, వీరసాయి గోపా ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.
ఈ మూవీ విడుదల తేదీ ఖరారైంది. వైవిధ్యభరిత కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ చిత్రంలో రష్మిక మందన్న మునుపెన్నడూ చూడని క్యారెక్టర్ లో నటిస్తోన్నారు. లీడ్ రోల్‌లో అలరించనున్నారు. గోండు తెగకు చెందిన ఓ వారియర్ పాత్రను పోషిస్తోన్నారు. ఈ విభిన్నమైన పాత్ర కోసం ఆమె శారీరకంగా, మానసికంగా ఎంతో కఠిన శిక్షణ తీసుకున్నట్లు చిత్రం యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాలో నీటి అడుగున శ్వాస బిగబట్టి చేసే ఒక యాక్షన్ సీన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఆసియాలోనే ఓ ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ అండర్‌వాటర్ యాక్షన్ సీక్వెన్స్ చేయడం ఇదే మొట్టమొదటి.
రాహుల్ రవీంద్రన్ ది ఇందులో కీలక పాత్ర. గతంలో రష్మిక నటించిన ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రానికి అతనే దర్శకుడు. ఇప్పుడు వారిద్దరూ కలిసి మరో మూవీలో స్క్రీన్ షేర్ చేసుకోబోతోన్నారు. ఓ యోధురాలి క్యారెక్టర్ లో రష్మిక నటిస్తోన్నందున యాక్షన్ సీక్వెన్స్ కు అధిక ప్రాధాన్యత ఉందీ ఫిల్మ్ లో. ట్రాయ్, బాహుబలి 2, 300, జవాన్ చిత్రాలకు స్టంట్ కోరియోగ్రాఫర్ గా పని చేసిన కేచా కంఫాక్డీ ఈ సినిమాకు పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తోన్నారు. టాప్ సినిమాటోగ్రాఫర్ శ్రేయాస్ పీ కృష్ణ విజువల్స్ అందించగా, జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.
సెట్స్ పై ఉండగానే.. ఈ సినిమా డిజిటల్ ఓటీటీ రైట్స్ కూడా హాట్ కేక్ లా అమ్ముడుపోయాయి. ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో పాటు రష్మిక చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న రణబాలి విడుదలకు సిద్ధమైంది. రీసెంట్‌గా షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో కలిసి కాక్‌టెయిల్ 2లో నటించారు రష్మిక.
MYSAA!
— Rashmika Mandanna (@iamRashmika) September 1, 2026
The rage! The pain! The heartache! The grief! The grit! The courage! The power and the storm you don’t anticipate coming - That’s Mysaa! 🔥
In cinemas worldwide on 27.11.26!❤️@RawindraPulle @jakes_bejoy @unformulafilms @TSeries @tseriessouth pic.twitter.com/aaDqspvHE7













Click it and Unblock the Notifications