బిజినెస్‌లో నాగచైతన్య దూకుడు.. నాగార్జున కూడా సరిపోడు!
అక్కినేని నాగార్జున అంటే సినీ పరిశ్రమలో మన్మథుడుగా పేరు. అమ్మాయిల కలల రాకుమారుడిగా పేరు తెచ్చుకున్నారు. సినిమాలు దాటి బయటకు వస్తే ఆయనలో ఓ అద్భుతమైన వ్యాపారవేత్త కనిపిస్తారు. సినిమాల్లో వచ్చే ఆదాయంకన్నా వ్యాపారాలద్వారా నాగార్జున సంపాదించిన ఆదాయమే చాలా ఎక్కువ. సినిమా రెమ్యునరేషన్ అనేది ఆయనకు సరదాగా వచ్చే ఆదాయం. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన హీరోగా అవతరించాడు. ప్రస్తుతం ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నాడు.
వ్యాపారంలో దూకుడుగా
సాధారణంగా హీరోలుకానీ, హీరోయిన్లుకానీ తమ ఆదాయాన్ని ఇతర వ్యాపారాల్లోకి మళ్లించి అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తుంటారు. హీరోగొ నిలదొక్కుకున్న నాగచైతన్య సినిమాకు రూ.8 కోట్ల పారితోషికం తీసుకుంటున్నారు. ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ సినిమా చేస్తున్నారు. ఇటీవలే తోటి నటి శోభిత ధూళిపాళతో నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది వీరి వివాహం జరగబోతోంది. సినిమా హీరోగా రాణిస్తూనే వ్యాపార రంగంలో కూడా ఎంతో దూకుడుగా ఉన్నాడు నాగచైతన్య. తండ్రి నిర్వహించే వ్యాపారాలను చూసుకోవడమే కాకుండా తనకంటూ సొంతంగా ఓ వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఏడాదికి రూ.12 కోట్ల ఆదాయం
హైదరాబాద్ మాదాపూర్ లో 2022లో షోయు పేరుతో క్లౌడ్ కిచెన్ ప్రారంభించాడు. గౌర్మెట్ సౌత్-ఈస్ట్-ఆసియన్ వంటకాలకు ఇది ప్రసిద్ధి. పలురకాల ఆసియన్ వంటకాలను ఆహార ప్రియులకు అందిస్తూ మంచిపేరు తెచ్చుకుంటోంది. రుచితోపాటు పర్యావరణ అనుకూలమైన ప్యాకేజింగ్ పై కూడా ఈ కిచెన్ దృష్టిపెట్టి అందరి ప్రశంసలు అందుకుంటోంది. అతి తక్కువ సమయంలోనే హైదరాబాద్ లో ఉన్న టాప్-10 రెస్టారెంట్స్ లో ఒకటిగా ఎదిగింది. సినిమాలద్వారా వచ్చే ఆదాయంకన్నా దీనిపైనే చైతూ ఎక్కువగా సంపాదిస్తున్నాడు. ప్రతిరోజు ఈ కిచెన్ నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల ఆదాయం వస్తోంది. వారాంతపు సెలవులు వస్తే ఆదాయం డబుల్ అవుతోంది. ఏడాదికి షోయూ ద్వారా నాగచైతన్య రూ.10 నుంచి రూ.12 కోట్లు సంపాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications