తండ్రి నాగార్జునను మించిన 'మన్మథుడు' నాగచైతన్య?
అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం మీడియాతోపాటు సామాజిక మాధ్యమాల్లో కూడా చర్చనీయాంశంగా మారారు. సమంతకు విడాకులిచ్చేసిన తర్వాత నటి శోభిత ధూళిపాళతో ఈనెల ఎనమిదోతేదీన నిశ్చితార్థం జరుపుకున్నారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ తిన్నారు. నాగచైతన్య-శోభిత ప్రేమ గురించి ఎప్పటినుంచో వార్తలు వస్తున్నప్పటికీ నిశ్చితార్థంతో అవి నిజమయ్యాయి. శోభితకు ముందు సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సమంతకన్నా ముందు నాగచైతన్య మరో ఇద్దరిని ప్రేమించారు.
బాలీవుడ్ టాప్ హీరోయిన్ తో..
నాగచైతన్య తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన తర్వాత ఒక యంగ్ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి. ఆ హీరోయిన్ తో కలిసి బైక్ రైడింగ్ కు వెళ్లేవారు. ఎక్కువగా వినపడిన పేరు కృతిశెట్టి. ఈ వార్త తర్వాత బాలీవుడ్ హీరోయిన్ ఒకరితో చైతూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారని కొన్నాళ్లు వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో ఆమె టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వీరిద్దరితో నాగచైతన్య ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో మరో వార్త సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. చైతూ నటించిన బంగార్రాజు సినిమాలో దక్ష నగార్కర్ తళుక్కున మెరిసింది.

తండ్రి బాటలో నడుస్తున్నాడా?
ఆమెతో కూడా నాగచైతన్య ప్రేమ వ్యవహారం నడిపారని, మజిలీ సినిమాలో హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ తో కూడా చైతూ ప్రేమలో పడ్డాడంటూ వార్తలు వచ్చాయి. చూడటానికి ఎంతో అమాయకంగా కనిపించే నాగచైతన్య ఇంతమంది హీరోయిన్లతో ప్రేమలో పడ్డాడంటూ నమ్మబుద్ధి కావడంలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతని అమాయకమైన ముఖమే అలా అనిపిస్తోందేమో.. ఇదంతా నిజమేనని, తన తండ్రి నాగార్జున బాటలతోనే చైతూ నడుస్తున్నాడంటూ కొందరు తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తున్నారు. సినిమాల్లో నటించినందుకు అందరూ ఇలా అంటున్నారేమోనని, వాస్తవం ఉండకపోవచ్చని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ శోభితతో నిశ్చితార్థం జరుపుకొని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న తరుణంలో అతనిపై ఇలాంటి వార్తలు చక్కర్లు కొడుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications