ప్రేమించిన వ్యక్తి దూరం... స్టుపిడ్‌గా అఫైర్స్ పెట్టుకున్నానా?: నాగచైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా తండేల్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కాబోతోంది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. త్వరలోనే నాగచైతన్య శోభిత ధూళిపాళను వివాహం చేసుకోబోతున్నాడు. పసుపు దంచడానికి సంబంధించిన ఫొటోలను నిన్ననే శోభిత షేర్ చేసింది. దీన్నిబట్టి దగ్గరలోనే పెళ్లితేదీ ఉందని అర్థమవుతోంది. ఇరువైపులా పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోబోతున్నారు. ఇంతకుముందుగా సమంతకు నాగచైతన్య విడాకులిచ్చారు.
తన గుండె బద్దలైంది
నాగచైతన్య, సమంత విడిపోవడం మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి వీరిద్దరూ తిరిగి కలవకపోతారా? అంటూ ఆశగా ఎదురు చూశారుకానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్య మాట్లాడుతూ తన పాఠశాల, కళాశాల రోజుల్లో ప్రేమకు సంబంధించిన వ్యవహారాలను పంచుకున్నాడు. టీనేజ్ లోనే ఒకమ్మాయిని ఇష్టపడ్డానని, తను పాఠశాల మారుతున్నప్పుడు భరించలేకపోయానని, తన హృదయం బద్ధలైందని, తనను వదిలి ఎలా వెళతావు? అంటూ అడిగినట్లు చెప్పాడు. అలాగే కాలేజ్ లో కూడా ఇలాగే జరిగిందన్నారు.

వారు దూరమైతే బాధ తట్టుకోలేం
టీనేజ్ లో ప్రేమ విషయంలో బ్రేకప్ జరిగినప్పుడు ఎన్నో రోజులు ఏడ్చానని, తన జీవితంలో ఇంకేం మిగల్లేదనుకున్నానన్నారు. ప్రపంచం మొత్తం అంతమైపోయిందా? అనిపించిందని, వాటిని ఇప్పుడు తలుచుకుంటే తాను ఎంత స్టుపిడ్ గా అఫైర్స్ పెట్టుకున్నానా? అనిపిస్తుందని నాగచైతన్య వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాలు జీవితంలో ఎంతో నేర్పిస్తాయన్నారు. రిలేషన్ షిప్స్ విషయంలో భావోద్వేగానికి గురవుతారా? అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు నాగచైతన్య సమాధానమిస్తూ తాను చాలా ఎమోషనల్ అని, ప్రేమించిన వ్యక్తితో ఉండే అటాచ్ మెంట్ ను మాటల్లో వర్ణించలేమన్నారు. మననుంచి వారు దూరమైతే ఆ బాధ వర్ణనానతీతమన్నారు.












Click it and Unblock the Notifications